ప్రస్తుతం భారతదేశం లో దురదృష్టం ఏమిటి  అంటే భారతదేశంలో ఉన్న మీడియానే భారత దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడు వార్తలు ప్రచురితం చేస్తూ ఉంటుంది. అయితే ఏ దేశ మీడియా ఆదేశం ను మద్దతూ తెలుపుతూ  ఎప్పుడూ వెనకేసుకు వస్తూ ఉంటే భారతదేశంలోని కొన్ని మీడియా సంస్థలు మాత్రం భారతదేశం పైనే విమర్శలు చేస్తూ ఉంటాయి . ఇక అంతర్జాతీయ మీడియా అయితే ఎప్పుడూ భారత్ ను  నెగిటివ్ గా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే, ముఖ్యంగా బిబీసీ అయితే భారత్ ను ఎప్పుడూ నెగిటివ్గా ప్రొజెక్టు చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా బీబీసీ లో భారత్ కు సంబంధించి ఒక కథనం చర్చనీయాంశంగా మారింది. 

 


 చైనా భారత్ కి మధ్య 1962లో జరిగిన యుద్ధంలో చైనాలో చిక్కు పడిపోయినట్టు వంటి కొంత మంది భారత సైనికుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బిబిసి. 1962 యుద్ధంలో సెకండ్ లెఫ్టినెంట్ గా పనిచేసిన అమర్జిత్ బాహల్.. అప్పట్లో మేజర్ గా రిటైర్ అయినటువంటి కేకే తివారి లాంటి వాళ్ళతో 2012 సంవత్సరంలో చేసినటువంటి ఇంటర్వ్యూను ప్రస్తుతం ప్రొజెక్టు చేస్తుంది బీబిసి.ఈ యుద్ధంలో  చైనా సైనికులను  చంపుతూ ముందుకు దూసుకెళ్లినటువంటి వాళ్ళకు వెనక నుంచి ఎలాంటి సపోర్ట్  అందకపోవడంతో చైనాలో వాళ్ళని యుద్ధ ఖైదీలుగా మర్చి  వాళ్ళని దారుణంగా కొట్టడం ఆహారం పెట్టకుండా నిర్బంధించడం చేశారు. 

 


 దారుణమైనటువంటి వేధింపులకు గురి చేశారు. ఇవన్నీ ప్రస్తుతం బీబిసి ప్రాజెక్ట్ చేసింది. అంతే బీబీసీ  ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు, ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వీటన్నిటిని చదివి భారతీయులు ఏం ఇన్స్పైర్ అవ్వాలి అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. మామూలుగా అయితే పత్రికల్లో ఎలా ఎదిరించారు అని ఒక ఇన్స్పిరేషనల్  స్టోరీస్ పెడతారని కానీ.. భారత్ ని ఢీ మోరలైజ్  చేసేందుకు బీబీసీ  ఇలాంటి భయపెట్టే కథనాలు ప్రచురితం చేసింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: