ప్రపంచంలో కరోనా వల్ల ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికి తెలిసిందే.. ఒక కష్టమే కాదు సుఖపడే వారు కూడా ఉన్నారు.. కొందరు కరోనా హలీడేస్‌ను ఏంచక్కా హనీమూన్ డేస్‌లా ఎంజాయ్ చేస్తున్నారు.. అందువల్ల ఈ సమయంలో అంటే లాక్ డౌన్ కాలంలో వయాగ్రా మాత్రలకు చాలా డిమాండ్ పెరిగిందట. అంతే కాదు సింగిల్ డోసు సరిపోవడం లేదని, మరీ డోసులు పెంచేసి వాడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.

 

 

ఇలా చేయడం వల్ల ఎన్ని నష్టాలో ఆలోచించడం లేదని, కేవలం అప్పటి వరకు లభించే సుఖం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారని వైద్యులు అంటున్నారు.. కాగా వయాగ్రా మాత్రలను వాడటం వలన రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయి పడిపోయే ప్రమాదం ఉందని వైద్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వయాగ్రాలో సైల్డనాఫిల్, గ్లైబురైడ్ ఔషదాలు ఉన్నాయని, ఈ ఔషధాలను డయాబెటిస్ వారికోసం వాడతారని వర్జీనియా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదీగాక వయాగ్రా మాత్రలను అధికంగా వాడే వారిలో, మూర్ఛవ్యాధి వస్తుందని, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు.

 

 

ఇక  వయాగ్రా మాత్రల ఫార్ములా విషయం చాలా గోప్యంగా ఉంటుంది, ఈ విషయాన్ని గమనించక చాలా మంది వయాగ్రాను ఎక్కువ మోతాదులో తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.. అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే సాధారణంగా ఒక్కో వయాగ్రా మాత్రలో 155 మిల్లీగ్రాముల గ్లైబురైడ్ ఉంటుందట. ఇది డయాబెటిస్ రోగులకు ఇచ్చే డోసు కంటే దాదాపుగా 10 రెట్లు ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

 

 

అదీగాక హై షుగర్, కిడ్నీ సంబధిత వ్యాధులు ఉన్నవారు వయాగ్రా మందులు వాడితే ప్రాణాలకే ముప్పు అని, వయాగ్రా మందుల వల్ల తలనొప్పి, నడుంనొప్పి, కడుపులో వికారం, విరేచనాలు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కొందరికి వస్తాయని తెలుపుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: