జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఎవరికి అర్థం కావడం లేదు. ఒకవైపు సినిమాల్లో చేస్తూనే, మరోవైపు రాజకీయాల్లోనూ ఇలా రెండు పడవలపైనా కాళ్లు వేశారు.  ఏపీలో బలమైన టిడిపి వైసీపీలను ఎదుర్కొని అధికార పీఠం దక్కించుకోవాలంటే మళ్లీ ఆషామాషీ వ్యవహారం కాదు. పవన్ సొంతంగా రాజకీయాల్లో పైకి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి భారమంతా బీజేపీ మోస్తుందిలే అన్నట్టుగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ కూడా  2024లో జరిగే ఎన్నికల్లో పవన్ క్రేజ్ ను ఉపయోగించుకుని అధికార పీఠాన్ని దక్కించుకోవాలని అడుగులు వేస్తోంది. ఇక పవన్ విషయానికి వస్తే, పార్టీని ముందుకు నడిపించే క్రమంలో ఆయన అనేక తప్పటడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

 

IHG
 ఇక పవన్ కూడా ఏపీ లో రాజకీయం అంతా బిజెపి చూసుకుంటుందిలే అన్నట్టుగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందించడం తప్పితే, పెద్దగా యాక్టివ్ గా ఉండడంలేదు. మొన్నటి వరకు సినిమాల్లో మొన్నటి వరకు బిజీ అయినా, లాక్ డౌన్ కారణం గా  అది కూడా ఆగిపోవడంతో ఖాళీగానే ఉంటున్నారు. ఈ సమయంలో ఏపీ రాజకీయ వ్యవహారాల్లోకి ప్రత్యక్షంగా దిగాల్సి ఉన్నా, పవన్ హైదరాబాద్ కే పరిమితం అయిపోయారు. 2024 నాటికి బీజేపీ సహకారం తో తనకు అధికారం దక్కుతుందని పవన్ ఆశలు పెట్టుకున్నారు. కానీ అప్పటికి పరిస్థితి పవన్ అంచనా వేసినట్లుగా ఉండకపోవచ్చు. 


బిజెపి హవా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పవన్ ఇమేజ్ గతం కంటే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ వైసిపి, టిడిపి మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశం లేకపోలేదు. మళ్లీ ఎన్నికల్లో ఓటమి పలకరించకుండా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటాలు, ఉద్యమాల ద్వారా పవన్ ప్రజల్లో చొచ్చుకు వెళ్ళాలి. లేకపోతే మళ్లీ 2019 ఫలితాలు రిపీట్ కావచ్చు. బీజేపీకి ఏపీలో ఉన్న బలం ఏంటో అందరికీ తెలుసు. పవన్ బిజెపి సహహారంతో ఏపీలో అధికారం దక్కించుకోవాలని చూస్తుండగా, బీజేపీ ని అడ్డుపెట్టుకుని ఎదగాలని పవన్ భావిస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకర భారం వేసుకుని ఎవరు పూర్తిగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టడంలేదు. దీంతో రెండు పార్టీలు తీవ్రంగా నష్టపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: