జగన్ ఒక ఎంపీగా తన రాజకీయ  జీవితాన్ని మొదలుపెట్టి ఇపుడు ఏపీనే ఆక్రమించుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ముళ్ళను తొలగించుకుంటూ మెల్లగా  పూలబాట వేసుకున్నారు. జగన్ గత ఏడాది సాధించిన అద్భుత  విజయం ఆయన కష్టార్జితం. ఆయన స్వార్జితం. ఇంతదాకా వచ్చిన విజయాన్ని ఇపుడు నిలబెట్టుకోవాలి. జగన్ మళ్ళీ ఆ బంపర్ విక్టరీని కొనసాగించాలి అంటే ఇంతకు ఇంతా చేయాలి. అదే ఇపుడు అసలైన బిగ్ టాస్క్.

 

మరి ఈ విషయంలో జగన్ ఎంతవరకూ సక్సెస్ అయ్యారూ అన్న దాని మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే జగన్ ఏడాది పాలనలో తన లక్ష్యాలను సాధించారని తాజాగా ఒక సర్వే చెప్పడం విశేషం. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ జగన్ గ్రేట్ అంటోంది. ఏపీలో ఆయనకు తిరుగులేదు అంటోంది. జగనే మళ్లీ అధికారంలోకి వస్తారు అని చెబుతోంది.

 

పైగా అయనకు గత ఏడాది ఎన్నికల్లో 51 శాతం ఓట్లు వచ్చాయి. 151 సీట్లు వచ్చాయి. ఇపుడు అది 55 శాతం అయింది. అంటే ఏకంగా నాలుగు శాతం ఓట్లు పెరిగాయి అన్నమాట. ఇది నిజంగా అద్భుతమే. ఏడాది పాలన తరువాత ఓట్ల శాతం తగ్గాలి లేకపోతే అలాగే ఉన్నా ఫరవాలేదు కానీ ఏకంగా నాలుగు శాతం పెరగడం అంటే జగన్ జనంలోనే పూర్తిగా  ఉన్నారనే అనుకోవాలి. 

 

అదే సమయంలో టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం నలభై అయితే అది రెండు శాతం తగ్గింది. ఇక జనసేన, బీజేపీ కాంబోకి 5 శాతం ఓట్లు వచ్చాయి. నిజానికి జనసేనకు 7 శాతం బీజేపీకి 1 శాతం ఓట్లు వచ్చాయి. ఆ లెక్కన ఎనిమిది శాతం ఓట్లు కావాలి. కానీ రాజకీయాలు మాదమెటిక్స్ లెక్కలు  కావు కాబట్టి అయిదు శాతం   దగ్గర ఆగిపోయింది. మరి ఈ కాంబో నామమాత్రమేనని ఈ సర్వే బట్టి తెలుస్తోంది.

 

జగన్ ఇప్పటికీ ఏపీలో రాజకీయ  బలవంతుడుగా ఉన్నారు. చెప్పాలంటే ఏ ఏటికి ఆ ఏడు బలం పెంచుకుంటున్నారు. ఆయన వెల్ఫేర్ స్కీమ్స్  ఆయన్ని కాపాడుతున్నాయి. మరి జగన్ని ఢీ కొట్టే సీన్ ఏపీలో విపక్షానికి లేదా అంటే ఇప్పటికి చేదు సమాధానమే లభిస్తోంది. ఏమైనా ఏపీని జగన్ కాప్చర్ చేశారనే అనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: