కరణం బలరామ్...ప్రకాశం జిల్లాలో బలమైన రాజకీయ నాయకుడు. మొదట కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలు పెట్టి, ఆ తర్వాత దశాబ్దాల పాటు టీడీపీలో ఆధిపత్యం చెలాయించారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున చీరాల నియోజకవర్గం బరిలో దిగి అదిరిపోయే మెజారిటీతో గెలిచి...మొన్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో తన సన్నిహితుడైన చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జగన్‌కు జై కొట్టారు.

 

కుమారుడుకు ఏమో వైసీపీ కండువా కప్పించి, తన పదవి పోకూడదని కండువా కప్పుకోకుండా జగన్‌కు మద్ధతు తెలిపారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కరణం ఫ్యామిలీ వైసీపీలోకి వచ్చేసింది. కరణం ఎలాగో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, నాలుగేళ్ల వరకు బండి నడిపించవచ్చు. మరి ఆ తర్వాత కరణం ఫ్యామిలీ పరిస్తితి ఏంటి? జగన్ వారికి ఏం ఆఫర్ ఇచ్చారు? అంటే ఏమి ఇవ్వలేదనే తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం పార్టీలో చేరారు గానీ, వారికి జగన్ ఎలాంటి ఆఫర్లు ఇవ్వలేదని తెలుస్తోంది.

 

అయితే కరణం..కుమారుడుకు అద్దంకి ఇన్‌చార్జ్ ఇవ్వాలని అడిగారట. కానీ జగన్ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. అలాగే నెక్స్ట్ చీరాలలో కూడా కరణంకు పోటీ చేసే అవకాశం దక్కుతుందా? అంటే ఏమో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం చీరాల వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. ఇక దీని బట్టి చూస్తే కరణం ఫ్యామిలీకి ఎలాంటి ఆఫర్ లేదని తెలుస్తోంది. కాకపోతే నెక్స్ట్ ఎన్నికల సమయానికి జగన్ ఏదొకటైతే ఇవ్వడం ఖాయమే. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. తాజాగా పార్టీలోకి వచ్చిన శిద్ధా ఫ్యామిలీకి కూడా ఎలాంటి ఆఫర్లు ఇవ్వలేదని తెలుస్తోంది.

 

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో శిద్ధాకు గానీ, ఆయన కుమారుడు సుధీర్‌కు గానీ దర్శి అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చే అవకాశముందని జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు పెద్దగా బాగోలేదని కాబట్టి, వచ్చే ఎన్నికల్లో దర్శి స్థానం శిద్ధా ఫ్యామిలీకే దక్కుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: