వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక కొన్ని నెలలు అయిన తర్వాత మొదటినుండి ఆయనపై కయ్యానికి కాలు దువ్వుతున్న సొంత పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. మరి ఎందువలన రఘురామకృష్ణంరాజు పార్టీ హైకమాండ్ కి ఎదురుతిరిగారు అనేదాని విషయంలో ఇప్పటికి స్పష్టత ఎవరికీ లేదు. అప్పట్లో జగన్ పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెట్టాలి అని తీర్మానించిన… ఆ తీర్మానానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడటం జరిగింది. ఆ టైం లో పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఢిల్లీలో బిజెపి పార్టీ పెద్దలకు మంచి భోజనం ఏర్పాటు చేసి ఢిల్లీ స్థాయిలో తన బల నిరూపణ చేసే దిశగా రఘురామకృష్ణంరాజు వ్యవహరించడం జరిగింది.

 

ఆ తర్వాత కొద్దిగా పరిస్థితులు సద్దుమణిగాయి అని అందరూ అనుకున్న సమయంలో జగన్ ఏడాది పరిపాలన గడిచాక మరింతగా ఇటీవల రెచ్చిపోయారు. ఏకంగా అధ్యక్షుడు జగన్ మీద రెచ్చిపోతున్నా కొంతమంది ఎమ్మెల్యే లపై అవినీతి ఆరోపణులు చేయడం జరిగింది. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు అది కూడా రఘురామకృష్ణంరాజు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియా ముందు మండిపడ్డారు. ఈ వార్త ఏపీ రాజకీయాల్లో పెద్ద హైలెట్ అవ్వటంతో… రఘురామకృష్ణంరాజు కావాలని పార్టీ నుండి సస్పెండ్ అయి బిజెపిలో చేరాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు.

 

ఈ తరుణంలో పార్టీ తనపై వేటు వేస్తే రఘురామ కృష్ణంరాజు బిజెపిలో చేరాలని ఆలోచిస్తున్నారని చాలా మంది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క రఘురామకృష్ణంరాజు ఈ విధంగా జగన్ పార్టీ మీద విమర్శలు చేయడం వెనుక బీజేపీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపి దగ్గర రఘురామకృష్ణంరాజు అంతా మాట్లాడుకుని మొత్తం కన్ఫామ్ చేసుకొని ఇలా రెచ్చిపోతున్నారు అనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ లో మెయిన్ పాయింట్ చూసుకుంటే జగన్ కి బీజేపీ కి వైరం అవ్వాలని, వెంటనే తనని పార్టీ నుండి సస్పెండ్ చేశాక బీజేపీలో చేరాలనే దిశగా ఈయన వ్యవహారం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: