వైసీపీ నర్సాపురం పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఉన్న కొద్దీ సీరియస్ అయ్యేలా ఉంది. మొన్నటివరకు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో మీడియా ముందు ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇటువంటి సమయంలో తాజాగా రఘురామ కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కి రాసిన లెటర్ వివాదాస్పదంగా మారింది. జిల్లాలో రాజకీయ నేతలు మరియు కార్యకర్తలు బొమ్మలు దహనం చేస్తున్నారు అని తనను దారుణంగా విమర్శలు చేస్తున్నారని కించ పరిచేలా మాట్లాడుతున్నారని లెటర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా వారి నుండి తనకు ప్రాణహాని ఉందని తనకు తగిన భద్రత కల్పించాలని కోరారు.

IHG

అంతేకాకుండా ఈ విషయంలో కేంద్ర హోం శాఖ ని కూడా ఇన్ వాల్వ్ చేయాలని రఘురామకృష్ణంరాజు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కి లెటర్ రాసిన మాదిరిగా అదే స్థాయిలో లెటర్ రాయాలని రఘురామకృష్ణంరాజు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VENKATESH' target='_blank' title='victory-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>victory</a> of nationalism: BJP

మొత్తంమీద చూసుకుంటే తనని పార్టీ నుండి ఏదోవిధంగా వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసేలా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారు అని అటు బీజేపీ నుండి ఒత్తిడి, ఇటు తనకు ప్రాణ హాని అంటూ చేస్తున్న ఆరోపణలు తో పార్టీ నుండి బయటకు రావటానికి రఘురామకృష్ణంరాజు ప్లాన్ చేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ రాజకీయాల్లో రాకముందే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించడం పట్ల ఏపీ రాజకీయాల్లో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: