జగన్ మోహన్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో మద్యం అమ్మకాల ధరలు తారా స్థాయికి చేరాయి.. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు కూడా నిలిచి పోయాయి. దాంతో ఆంధ్రాలో ని మందుబాబులు తెలంగాణలో అమ్మకాలు మొదలు పెట్టారు. దాంతో తెలంగాణ లో మద్యం అమ్మకాల రేటు అమాంతం పెరిగింది. తెలంగాణ లో మద్యం  తయారీ కూడా భారీగా పెరిగి పోయింది. మద్యం తాగొద్దని ఆంధ్రాలో అమ్మకాలను తగ్గిస్తే, కొందరు తెలంగాణ నుంచి దిగుమతి చేసుకోవడం అందరికి ఆగ్రహానికి గురిచేసింది. 

 

 

తెలంగాణ మద్యం అక్రమ రవాణా పెరిగి పోతోంది. సరిహద్దు జిల్లాల నుంచి లక్షల రూపాయల మద్యం నిత్యం అక్రమంగా తరలుతోంది. ఎస్‌ఈబీ దాడులు చేస్తున్నా చాపకింద నీరులా అక్రమ వ్యాపారం సాగి పోతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో లక్షల విలువైన అక్రమ మద్యం పట్టుబడింది. సూర్యాపేట నుంచి గుంటూరు జిల్లా తెనాలికి తరలిస్తున్న లక్షల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. లారీ లో భారీ మొత్తం లో సూర్యాపేట నుంచి గుంటూరు కు తరలిస్తున్న మద్యం బాటిళ్ల ను అధికారులు పట్టుకున్నారు.. 

 

 

 

అక్రమంగా తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తెనాలి ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. తవుడు లారీలో తరలిస్తున్న రూ.3.50 లక్షల విలువైన 72 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుగ్గిరాల మండలం రేవేంద్ర పాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు మద్యం తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు.మూడున్నర లక్షల రూపాయల విలువైన 72 కేసుల్లో 3742 మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.  విచారణ చేపట్టారు. రేపు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: