ఈ మధ్యకాలంలో మాయమాటలు చెప్పి యువతులను నమ్మించి వంచిస్తు ఆ తర్వాత మొహం చాటేస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. దీంతో మోసపోయామని గ్రహించిన మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా ఓ నకిలీ ఎస్ఐ లీలలు బయటపడ్డాయి. ఎస్సైగా పనిచేస్తున్న అంటూ నకిలీ గుర్తింపు కార్డుతో ఓ యువతిని నమ్మించి  పెళ్లాడాడు. ఆ తర్వాత ఆ యువతి దగ్గర నుంచి లక్షల రూపాయలు కాజేశాడు నకిలీ పోలీస్. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది యువతి . శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. 

 


 వివరాల్లోకి వెళితే... ఆమదాలవలస మండలంలో కోర్లకోట్ల  కు చెందిన పైడి రామచంద్రరావు పోలీసు దుస్తుల్లో ఫోటో తీసుకున్నారు. ఈ క్రమంలోనే తను ఎస్ఐ గా పని చేస్తున్నట్లు ఒక ఐడి కార్డు కూడా చేసుకున్నారు. దీంతో యువతులకు వల వేసి డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఉన్న రామచంద్ర రావు  విశాఖపట్నంలో గవర కంచరపాలెం చెందిన ఓ యువతి కి గాలం  వేశాడు. యువతితో పరిచయం పెంచుకొని ఆ తర్వాత ప్రేమలోకి దించాడు . ఈ క్రమంలోనే ఎన్నో మయమాటలు చెప్పి  గత ఏడాది రెండో పెళ్లి చేసుకున్నాడు . పెళ్లి తర్వాత ఆ వ్యక్తి మాత్రం ఉద్యోగానికి వెళ్ళకుండా  రోజుల తరబడి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. 

 


 ఈ నేపథ్యంలో ఉద్యోగానికి  ఎందుకు వెళ్లడం లేదు అంటూ ప్రశ్నించింది భార్య. దీనిపై రామచంద్రరావు  తాను  సస్పెండ్ అయ్యాడని... ఆరోగ్యం బాగా లేదని ఇలా వింత వింత సాకులు చెబుతూ వచ్చాడు. అంతేకాదు గ్రూప్-1 పరీక్షలకు సిద్ధం అవుతున్న అంటూ  భార్య తండ్రి నుంచి ఏకంగా 12.80 లక్షలు కాజేశాడు. ఇక పెళ్ళి జరిగినప్పుడు భార్యకి తల్లిదండ్రులు పెట్టిన బంగారాన్ని మొత్తం తాకట్టు  పెట్టేసాడు. ఇక రామచంద్ర రావు తన పెళ్లి విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్తపడ్డారు. చివరికి తెలియడంతో యువతిని వేధించిన మొదలు పెట్టాడు. తాను  మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. ఇక  పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: