నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు వైసీపీ పార్టీని ఏ కోణంలో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొదటిలో పార్టీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియా ముందు హాట్ టాపిక్ అయిన రఘురామకృష్ణంరాజు ఉన్న కొద్ది స్పీడ్ పెంచుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత ఇటీవల మీడియా లో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు భయంకరమైన అవినీతికి పాల్పడుతున్నారని రకరకాలుగా విమర్శలు చేయడం జరిగింది. పార్టీ అధ్యక్షుడు జగన్ అయితే ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని ఆయన చుట్టూ ఆయన సామాజిక వర్గానికి చెందిన కోటరీ ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

అసలు ఎన్నికల సమయంలో జగన్ బతిమిలాడితే అప్పుడు వైసీపీలో చేరటం జరిగిందని కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా పశ్చిమగోదావరి జిల్లాలో రఘురామకష్ణంరాజు పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత పార్టీ కేడర్ నుండి మొదలయ్యింది. ఎమ్మెల్యేలతోపాటు కార్యకర్తలు కూడా రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా రఘురామకృష్ణంరాజు దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. కోడి గుడ్లతో, టమాటాలతో రఘురామకృష్ణంరాజు ఫ్లెక్సీలపై దాడి చేస్తున్నారు.

 

దీంతో ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి జిల్లా నాయకులతో పాటు కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. తనకు ప్రాణహాని ఉందని లెటర్ రాష్ట్ర ఎస్పీకి అందజేశారు. మొత్తంమీద చూసుకుంటే రఘురామకృష్ణంరాజు పార్టీ నుండి సస్పెండ్ అయి కొత్త దారి వెతుక్కోవడానికి రెడీ అవటానికి ఈ కొత్త కహానీలు తెరపైకి తెచ్చారని తాజాగా ఆయన చేస్తున్న వ్యవహారంపై పశ్చిమగోదావరి వైసీపీ పార్టీ క్యాడర్ లోలోపల గుసగుసలు ఆడుతోంది. పార్టీ అధిష్టానం నుండి తన పై వేటు పడకపోయినా, పార్టీ కార్యకర్త నుండి వ్యతిరేకత వచ్చిన దాన్ని  సద్వినియోగం చేసుకుని పార్టీ నుండి బయటకు వెళ్లి పోవడానికి  రఘురామకృష్ణంరాజు  ఆడుతున్న డ్రామాలు అని జిల్లా రాజకీయ నేతలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: