ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువ అయిపోతుంది విషయం తెలిసిందే. ప్రతి రంగంలోనూ సైబర్ నేరగాళ్లు ఏదో ఒక విధంగా జనాలను బురిడీ కొట్టించేందుకు  ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆగడాలను అరికడుతూన్నప్పటికీ కూడా సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో రెచ్చిపోతూనే ఉన్నారు. ఏదో విధంగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో ఏ పని చేయాలన్నా సైబర్ నేరగాళ్లు ఎక్కడ ఎటాక్ చేస్తారో  అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

 

 

 ముఖ్యంగా బ్యాంకు ఖాతాల విషయంలో అయితే సైబర్ నేరగాళ్ల బెడద మరింత ఎక్కువ అయిపోయింది కస్టమర్లకు. కనీసం ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకోవాలన్న కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతలా బ్యాంకింగ్  కస్టమర్లను సైబర్ నేరగాళ్లు  ప్రభావితం చేశారు. పొరపాటున సైబర్ నేరగాళ్లకు చేతికి చిక్కామా  ఇక ఖాతాలోని డబ్బులు అన్నింటిని గుల్ల చేసేస్తారు  సైబర్ నేరగాళ్లు. ఇక ఆ తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా తప్పదు. ఇలా మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతునే  ఉంది అన్న విషయం తెలిసిందే. 

 

 

 ఈ క్రమంలోనే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఉచితంగా కరోనా టెస్టులు చేస్తాము అంటూ ఏదైనా మెయిల్ వస్తే దాన్ని క్లిక్ చేయవద్దు అంటూ ఖాతాదారులకు సూచించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పొరపాటున తొందరపడి అలా వచ్చిన మెసేజ్ ని క్లిక్  చేశారు అంటే... మీ ఖాతా సైబర్ నేరగాళ్ల బారిన పడటం ఖాయం అని హెచ్చరిస్తుంది ఎస్బిఐ.  సైబర్ నేరగాళ్లు మీకు ఖాతా  పై ఫిషింగ్ ఎటాక్  నిర్వహించే ప్రమాదముందని... ఈ క్రమంలోనే పలు ఐడి ల నుంచి వచ్చే మెయిల్ లను  క్లిక్ చేయవద్దు అని సూచిస్తుంది. ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ ఖాతాదారులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: