ఈ మద్య వన్యమృగాలకు రక్షణ లేకుండా పోతున్న విషయం తెలిసిందే. కేరళలోని మల్లప్పరంలో గర్భంతో ఉన్న ఏనుగు పేలుడు పదార్ధాలు ఉన్న పైనాపిల్ తిని మరణించిన సంగతి తెలిసిందే.  ఈ ఘటన తరువాత కేరళ సర్కార్ అప్రమత్తం అయ్యింది.  వన్యప్రాణాలు సంచరించే ప్రాంతాల్లో నిఘాను పెంచింది. ఈ ఉదంతాలు మరువ ముందే తమిళనాడులో మరో ఘోరం చోటు చేసుకుంది. 12 ఏళ్ల ఓ మగ ఏనుగు కోయంబత్తూరు శివారులోని జంబుకండి గ్రామంలో ప్రాణాలు కోల్పోయిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆ ఏనుగు నోటి గాయాలతో బాధపడుతోందని వివరించారు. ఈ విషయాన్ని గుర్తించి తాము దాన్ని రక్షించడానికి చికిత్స అందించి, ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయామని తెలిపారు.

 

ఇలా మనుషులే మూగ జీవాల పట్ల శత్రువులుగా మారుతున్నారు.  దారుణంగా హింసిస్తూ చంపేస్తున్నారు. అలాంటిది అడవిలో కృరమృగంగా చెప్పుకునే ఓ పులికి గుడి కట్టించి తమ ఆరాద్య దైవంగా భావిస్తున్నారు. ఈ సంఘటన  కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరదండి, సిర్పూర్‌ మండలం జక్కాపూర్‌లో జరిగింది. అక్కడి గిరిజనులు వారు దైవంగా పులికి ఆలయం నిర్మించారు. పులి దేవుడికి నిత్యం ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. 

 

పులి దేవుడిని ప్రార్థిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భావిస్తున్నారు. సంతానం కోసం కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి శుభకార్యాలు జరపాలన్న మొదలు ఈ గుడికి వచ్చి పూజలు చేసి ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాలు మొదలు పెడుతుంటారు. పులి గాండ్రింపు వింటే పంటలు సమృద్ధిగా పండుతాయని వారి నమ్మకం. దీంతో ఏటా విత్తనాలు సాగు చేసే సందర్భంగా పులి దేవుని ఆశీస్సులు తీసుకుని విత్తనాలు నాటుతున్నారు. అంతే కాదు  పులి దైవం కోసం నిర్మించిన గుడి దగ్గర జాతర కూడా నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: