ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఈ మద్య సెల్ ఫోన్లతో దాన్ని షూట్ చేయడం ఫ్యాషన్ అయ్యింది.. తామేదో ఘనకార్యం సాధించినట్టు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  కానీ నదిలో ఓ పెళ్లి బృందానికి చెందిన కారు కొట్టుకు పోతుంటే.. తమ ప్రాణాలకు తెగించి తాళ్లతో దాన్ని కట్టి బయటకు తీసుకు వచ్చి వారి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన జార్ఖండ్ లోని పలాము జిల్లాలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే... పెళ్లి బృందం వరుడి ఇంటికి వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి కారు నదిలోకి పడిపోయింది. నీటీ ప్రవాహ వేగానికి అదికి కొట్టుకుపోవడం ప్రారంభించింది.

 

ఆ ప్రవాహం చూస్తే ఎవ్వరికైనా భయం వేస్తుంది.. నదిలో కారు సగం మునిగిపోవడం గమనించి స్థానికులు కొందరు వారిని కాపాడేందుకు నదిలోకి దూకారు. మునిగిపోతున్న కారు నుంచి వారిని కాపాడారు. కారును తాడును కట్టి, దాన్ని ఒడ్డుకు లాగారు.  అర కిలోమీటరు దూరం వరకు కారు నదిలో కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారికి ఇక బతకడం కష్టమే అనిపించింది. అయితే స్థానికులు వారి పాలిట ఆపద్బంధవులు అయ్యారు.

 

తమ ప్రాణాలకు తెగించి నదిలో దూకి  స్థానికులు కారు వద్దకు వెళ్లి కారు అద్దాలు పగలగొట్టి, దానికి తాడు కట్టి... మొత్తానికి వారిని కాపాడారు. ప్రమాద సమయంలో కారులో కొత్త జంటతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. మొత్తానికి వారిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. అందరూ క్షేమంగా బయటపడటంతో... వధూవరుల కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రాంచీలో బీభత్సంగా వర్షాలు పుడుతున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: