ఒక్కపుడు బ్యాంకు అకౌంట్ తెరవడానికి చాల టైం పట్టేది. అయితే దేశంలో అతిపెద్ద బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త సర్వీస్ ని అమలులోకి తీసుకొస్తుంది. అయితే మీరు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ తెరవాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా దేశీ పెద్ద బ్యాంకు అయినా యస్బీఐలో ఖాతా తెరవాలని ఆలోచిస్తున్నారా.. అయితే మీకు శుభవార్త.

 

 

మీరు బ్యాంక్‌కు వెళ్లకుండానే సులభంగానే అకౌట్ ఓపెన్ చేసే ఛాన్స్ ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అది కూడా కేవలం 4 నిమిషాల్లోనే మీకు మీ అకౌంట్ నెంబర్ వచ్చేస్తుందని అధికారులు తెలియజేశారు.

 

 

అయితే స్టేట్ బ్యాంక్ ఇన్ ‌స్టా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులు అందిస్తోందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా బ్యాంక్ అకౌంట్‌‌ను సులభంగానే తెరవొచ్చునాని తెలిపారు. ఎలాంటి డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్లాల్సిన పని లేదన్నారు. ఎస్‌బీఐ తన యోనో ప్లాట్ ‌ఫామ్ ద్వారా ఈ సర్వీసులు ఆఫర్ చేస్తోందన్నారు. రోజుల్లో ఎప్పుడైనా సరే అకౌంట్ తెరవొచ్చునని అధికారులు తెలియజేశారు.

 

 

ఎస్‌బీఐలో అకౌంట్ తెరిచిన వారికి రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుందని అధికారులు వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ సోషల్ మీడియా వేదికగా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సేవల అంశాన్ని బ్యాంకు యాజమాన్యం వెల్లడించారు. అంతే కాకుండా ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ కూడా అవసరం లేదని ఈ సందర్భాంగా తెలియజేశారు. అలాగే ఎలాంటి చార్జీలు పడవు అని తెలిపారు.

 

 

అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని భావించే వారు గూగుల్ ప్లేస్లోర్‌కు వెళ్లి యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుందన్నారు. తర్వాత ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ సాయంతో బ్యాంక్ ఖాతా తెరవొచ్చునన్నారు. మీకు ఆధార్ వెరిఫికేషన్ కోసం ఒక ఓటీపీ వస్తుందన్నారు. దీన్ని ఎంటర్ చేయాలన్నారు. తర్వాత అకౌంట్ ఓపెన్ అవుతుందని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: