ప్రస్తుత రోజులలో టెక్నాలజీ మారుతున్న కొద్ది... సైబర్ నేరాలు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్లు బ్యాంకులను ఆధారంగా చేసుకొని బాధితులను మోసం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అనేకం... అలాగే పేటీఎం, గూగుల్ పే లాంటి యాప్స్ ను వారి ఫోన్లో ఉపయోగిస్తున్నారు. మీ డెబిట్ కార్డులను అప్డేట్ చేస్తామని, తక్కువ వడ్డీకే రుణం ఇస్తాము అంటూ మెసేజ్ లు మెయిల్స్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా ప్రజలను సంప్రదించి పెద్ద మొత్తంలో డబ్బులను స్వాహ చేసుకుంటున్నారు. ఇక వారి మాటలను నమ్మి బినామీ ఖాతాలలో నగదు జమ చేసేస్తున్నామని చాలా మంది బాధితులు ఆలోచిస్తున్నారని పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు బాద్యుల నుంచి దోచేసుకున్న డబ్బులను ఈ వ్యాలెట్ లోకి లేక వారి బినామీ ఖాతాలోకి పంపి చేస్తున్నారు. 

 

 

ఇక ఇటీవల ఒక వ్యక్తికి లాటరీలో 25 లక్షల రూపాయల బహుమతి అంటూ మోసం చేసిన సైబర్ నేరస్థులు లక్ష రూపాయలలో కొల్లగొట్టి నగదును తన బినామీ ఖాతాలోకి జమా చేసుకున్నారు. ఇక సదరు బాధితుడు పోలీసుల అధికారులను ఆశ్రయించగా వారు దర్యాప్తు చేపట్టగా ఈ ఖాతాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్నట్లు విచారణలో తేలింది. ఇక ప్రస్తుతం పోలీసు అధికారులు బినామీ ఖాతాల పై ప్రత్యేక దృష్టి మళ్ళించారు. 

 

 

పోలీసు ఉన్నతాధికారులు ఆన్లైన్ మోసాలు, డెబిట్ క్రెడిట్ కార్డుల పిన్ నెంబర్లు తీసుకొని నగదు తో చేసుకోవడం తదితర నేరాలకు పాల్పడే వారిని గుర్తించడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందాలు ఢిల్లీ, ముంబై లో ఉంటున్న వారి కదలికలను రహస్యంగా వారిని గమనిస్తూ ఉన్నారు. బ్యాంకుల ద్వారా అంతర్రాష్ట్ర చుట్టాల వారు చేసే కార్యక్రమాలను కట్టడిచేసే అందులో 50 శాతం నగదు వారి ఖాతాలోకి వెళ్లకుండా చేయడం ద్వారా ఆ నగదును స్వాధీనం చేసుకోవచ్చు అని అధికారులు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: