ఈ మద్య కరోనా కాలంలో సరైన సమయానికి అప్పులు తీసుకన్నవారు చెల్లించలేక నానా ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఓ మహిళ తన అప్పు చెల్లించడానికి చేసిన చేసిన పని చూసి అందరూ ముక్కన వేలేసుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే.. నవీ ముంబైలోని కోపర్ ఖైరన్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళ తన భర్తకు తెలియకుండా  అప్పులు చేసింది. ఆ అప్పులు తీర్చే డబ్బు తన వద్ద లేకపోవడంతో వడ్డీలు పెరిగిపోవడం మొదలయ్యాయి.. ఇక ఆ బాధ భరించలేక ఓ కన్నింగ్ ఐడియా వేసింది. ఈ క్రమంలో తన ఇంటినే దోచుకుంది. రూ.4లక్షలు రుణంచెల్లించేందుకు ఇంట్లోని రూ.11.1 లక్ష విలువగల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు దొంగిలించింది. జూన్ 5న తనకు ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళ్లమని భర్తను కోరింది ఆ మహిళ. భర్త ఆమెను ఘన్సోలిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. భర్త ఆమెను పుట్టింటి వద్ద దింపి తన ఇంటికి వచ్చేశాడు. 

 

ఆ వ్యక్తి తన భార్యను మామగారి ఇంటివద్ద నుంచి ఆస్పత్రి వద్ద దింపి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు తనకు ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ఆ రాత్రి  తనను పుట్టింటి వద్ద దింపమని కోరింది.  రాత్రికి ఇంటికి వస్తానని భార్య చెప్పటంతో సాయంత్రం ఆఫీసు అయ్యాక రాత్రి గం.7-30 సమయంలో భార్యను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించగానే వారి ఇల్లు దోపిడీకి గురైనట్లు గుర్తించారు. అయితే ఆ దొంగ కిటికీ నుంచి వచ్చి వచ్చి దొంగతనం చేసి ఉంటాడని పోలీసుకు ఫిర్యాదు చేశాడు.

 

ఇక కేసు నమోదు చేసుకొని అన్ని రకాలుగా దర్యాప్తు చేశాడు.. కానీ కిటికీ నుంచి వచ్చిన ఆనవాళ్లు లేవు.. పైగా పోలీసులు బాధితుడి భార్యనుంచి వాంగ్మూలం తీసుకోటానికి ప్రయత్నించారు. ఆమె ఇచ్చిన  వాంగ్మూలంలో సందేహాలు తలెత్తటంతో  పోలీసులు ఆమెను మరింతగా ప్రశ్నించారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిచంగా నిజం ఒప్పుకుంది ఆ మహిళ.. అప్పుతీర్చటానికి తానే దొంగతనం చేశానని చేసిన  తప్పును ఒప్పుకుంది. చివరికి భర్త తన ఫిర్యాదును ఉపసంహరిచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: