భారత్-చైనా సరిహద్దు వద్ద ఇటీవల రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య జరిగిన ఘటనలో భారత్ సైనికులు 20 మంది చనిపోవడం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో తప్పు ఎవరిది అన్న దాని విషయంలో అంతర్జాతీయంగా రకరకాల వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో గల్వాన్ లోయలో జరిగిన ఈ ఘటనలో చైనాదే తప్పు అని అగ్రరాజ్యం అమెరికా ఇటీవల పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోపక్క భారత్ కూడా గల్వాన్ లోయలో చైనా నిర్మాణాలు చేపట్టడానికి తమ ప్రాంతంలోకి రావడం తోనే ఈ ఘటన జరిగినట్లు కవ్వింపు చర్యలకు చైనా పాల్పడుతున్నట్లు కేంద్ర పెద్దలు తెలిపారు. ఇదిలా ఉండగా చైనా దాడి విషయంలో మరొక స్ట్రాంగ్ ప్రూఫ్ ఇటీవల బయటపడినట్లు సమాచారం.

 

ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ప్రణాళికబద్ధంగా ఇండియన్ ఆర్మీ పై చైనా ఆర్మీ దాడికి పాల్పడినట్లు తాజా ప్రూఫ్ బట్టి స్పష్టమవుతోంది. క్లియర్ కట్  మేటర్ లోకి వెళ్తే ఆ దాడి జరగక ముందు కొన్ని రోజులు చైనా బుల్డోజర్ లు యుద్ధ ట్యాంకులు అలాగే ఆయుధ సామాగ్రిని తీసుకెళ్లే ట్రక్కులను తరలించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం బయటపడింది. జూన్ 6 నుంచి 16 మధ్య చిత్రీకరించిన ఈ శాటిలైట్ లో బయటపడిన ఈ విషయాన్ని ఓ ప్రముఖ జాతీయ మీడియా ఇటీవల టెలికాస్ట్ చేసింది.

 

చైనా దాదాపు ఆరు రోజులు ఎవరికి గుట్టుచప్పుడు కాకుండా ఆయుధ సామాగ్రిని గల్వాన్ లోయలో దాచిపెట్టి అప్పుడు భారత్ సైనికులపై దాడికి పాల్పడినట్లు ఈ జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. కావాలని భారత భూభాగంలో వివాదాస్పద గల్వాన్ ప్రాంతంలో చైనా వచ్చి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం తోనే ఈ వివాదం తలెత్తినట్లు… దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య గొడవ ప్రమాదకరంగా మారటంతో పెద్ద ప్రాణం నష్టం జరిగినట్లు శాటిలైట్ ద్వారా వెలువడిన ఫోటోలు తెలియజేస్తున్నాయని ఈ జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: