కరోనా అందరినీ కలవరపెడుతోంది... తమిళనాడు లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు విగ్రహాలకు మాస్కులు ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు. కొంతమంది ఆ పని చేసిన వాళ్ల మీద ఫైర్ అయ్యారు. తమిళనాడులో దివంగత నేతలు అన్నాదురై, ఎంజీఆర్​ విగ్రహాలకు గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్​లు​ తొడిగారు. ఇది గుర్తించిన ఆ ప్రాంత ప్రజలు విగ్రహాలకు ఉన్న ముసుగు​లను తొలగించారు.

 


తమిళనాడు కోయంబత్తూర్​ లోని నంజుందపురం బస్‌స్టాప్​ సమీపంలో ఉన్న అన్నాదురై, ఎంజీఆర్​ విగ్రహాలకు గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్​లు​ తొడిగారు. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వాటిని​ తొలగించారు. తమిళనాడులో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే  కొవిడ్​-19 వ్యాప్తిని నివారించడానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. మాస్క్​ ధరించకపోతే వారికి జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

 


ఈ విధంగా ప్రముఖుల విగ్రహాలకు వారి గొప్పతనం మరిచి ఆకతాయిలు ఇలాంటి పనులు చేయడం పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలని నెటిజన్లు అంటున్నారు. మామూలుగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తుల విగ్రహాలకు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి వారి విగ్రహాలకు మొఖం కనిపించకుండా ముసుగు వేస్తారు. కానీ ఇక్కడ మాస్క్ లు విగ్రహాలకు పెట్టి కరోనా పట్ల ఉన్న భయం కూడా తెలిపినట్లు అవుతుంది. దీని ఆధారంగా కూడా మనం స్వీకరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా పట్ల జాగ్రత్తలను ఎన్నో రకాలుగా చెబుతున్నాయి. దానికి ముఖ్య సంకేతం మనం ఫోన్ చేయగానే అవతలి వాళ్ళు మాట్లాడక ముందు వరకు మనకు ఒక కాలర్ ట్యూన్ వినిపిస్తుంది... అది దేశం మొత్తం అందరికీ వచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ఆంటీ చర్యలు కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం అని అర్థం.

మరింత సమాచారం తెలుసుకోండి: