ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ చైనా దేశానికి శత్రువులను పెంచుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. చైనా ముందుగానే హెచ్చరించి ఉంటే జాగ్రత్తలు తీసుకునేవాళ్లమని... చైనా నిర్లక్ష్యం వల్లే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని పలు దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. చైనాలో ఉన్న తమ దేశం కంపెనీలను కూడా వెనక్కు రావాలని ఆదేశిస్తున్నాయి. 
 
ప్రపంచంలోని మెజారిటీ దేశాలు చైనాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇదే సమయంలో భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో చైనాకు పలు దేశాలు భారీ షాకులు ఇస్తున్నాయి. తైవాన్ ఎయిర్ స్పేస్ లోకి నిన్న చైనా విమానం జే 10 అడుగుపెట్టింది. వెంటనే తైవాన్ చైనాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో యుద్ధవిమానం వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
మరోవైపు చైనా సముద్రంలోకి అమెరికా నావల్ షిప్స్ అడుగు పెడుతున్నాయి. ఆధునిక ఆయుధాలు అందులో ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు జపాన్ తన క్షిపణులను మోహరించి పెట్టుకుంది. జపాన్ వైపుగా చైనాకు సంబంధించిన యుద్ధనౌకలు వెళ్లాయని తెలుస్తోంది. చైనా కవ్వింపు చర్యలు, చైనా వ్యవహార శైలి ఇతర దేశాలు అలర్ట్ అవుతున్నాయి. చైనా ఏం చేసినా రివర్స్ లో అటాక్ చేయడానికి ఆ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. 
 
అదే సమయంలో చైనా భారత్ తో యుద్ధానికి సిద్ధమైతే జపాన్, అమెరికా తమ వంతుగా భారత్ కు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. చైనాపై భారత్ కు విజయం సాధించే సత్తా ఉన్నా ఇతర దేశాల సహాయం కూడా ఉంటే చైనా సైన్యం యుద్ధం చేయకుండానే వెనుదిరగడం ఖాయం. ఇజ్రాయెల్, జపాన్ శాటిలైట్ ద్వారా చైనా కదలికలను అంచనా వేస్తూ భారత్ కు సమాచారం ఇస్తున్నాయని తెలుస్తోంది. చైనాను ప్రపంచ దేశాలన్నీ ఒంటరి చేస్తూ ఎలాంటి సహాయసహకారాలు అందించకుండా భారత్ కే మద్దతు ఇస్తూ కుడితిలో పడ్డ ఎలుక స్థాయికి తెచ్చాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: