ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఈ ఏడాది కాలంలో కమర్షియల్ ట్యాక్స్ ద్వారా 55,243 కోట్ల రూపాయలను టార్గెట్ గా నిర్ణయించితే మొత్తంగా రెవెన్యూ కలెక్షన్స్ రూ. 43,332.45 కోట్లు వసూలు అయ్యాయి. జీఎస్టీ రెవెన్యూ , పెట్రోలియం ప్రాడక్ట్స్, లిక్కర్ (వ్యాట్), ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా ఈ మొత్తం వసూలైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంతో పోలిస్తే 0.65% రెవెన్యూ కలెక్షన్ పెరిగింది. 
 
గత ఏడాది కాలంలో దక్షిణాది రాష్ట్రాలు రెవెన్యూ కలెక్షన్లలో -3% నుండి -10% దాకా వెనుకబాటు నమోదు చేసుకుంటే ఏపీ కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ అద్భుతంగా పని చేసి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. 20192020 ఆర్థిక సంవత్సరంలో ఉత్తరాది రాష్ట్రాల నుండి ప్రవహించిన వరద నీరు వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక అనుబంధ రంగాలు అన్నీ దెబ్బతిని వాణిజ్య పన్నుల కలెక్షన్స్ పై వ్యతిరేక ప్రభావం చూపాయి. 
 
ఇంతటి ప్రతికూల పరిస్థితులలో కూడా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగస్తులు అందరూ శాయశక్తులా కష్టపడి మంచి ఫలితాలు సాధించారు. జీఎస్టీ రెవెన్యూ కలెక్షన్లలో అనంతపురం, ఏలూరు, కాకినాడ డివిజన్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మద్యపాన నియంత్రణలో భాగంగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల లిక్కర్ మీద వ్యాట్ పన్నులో తగ్గుదల నమోదైంది. 2020 - 2021 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ కలెక్షన్లు రూ.51,689 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. 
 
కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ కలెక్షన్లు బాగా మందగించాయి. ప్రభుత్వం ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్లని కిందటి ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,50,000 మందికి ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్లు చేయించాలని అధికారులను ఆదేశించారు. జీఎస్టీ శాఖాధికారుల కోసం అన్ని జిల్లాల్లో నూతనంగా సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది 

మరింత సమాచారం తెలుసుకోండి: