నేడు దేశయ స్టాక్ మార్కెట్ దుమ్ము రేపింది. బెంచ్ మార్కెట్ సూచీలు అన్ని లాభాల వైపు పరుగులు పెట్టాయి. నేడు లాభాల్లో ముగియడం వరుసగా మూడో రోజు కావడం గమనించాల్సిన విషయం. నేటితో స్టాక్ మార్కెట్ మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫార్మా, బ్యాంక్, మెటల్ షేర్ల ర్యాలీ తో మార్కెట్ లాభాల్లో దూసుకుపోయింది. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్ 479 పాయింట్లు ర్యాలీ చేయగా, నిఫ్టీ కూడా 10,386 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. ఇక మార్కెట్ సమయం ముగిసే సరికి సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 34911 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 67 పాయింట్ల లాభంతో 10,311 పాయింట్ల వద్ద నేటి మార్కెట్ ముగిసింది.

 


నేటి నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే గ్లెన్ మార్క్, బజాజ్ ఫిన్సర్వ్, కోల్ ఇండియా, వేదాంత, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇందులో గ్లేన్ మార్క్ షేర్లు 25 శాతం పైగా లాభపడింది. ఇక అలాగే hdfc, హిందాల్కో, ongc , విప్రో, గెయిల్ షేర్లు నష్టాల బాట నడిచాయి. ఇందులో విప్రో షేర్లు రెండు శాతం పైగా నష్టపోయింది.

 


అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల విషయానికి వస్తే బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కు 0.07 శాతం పెరిగి 42.22 డాలర్లకు చేరుకుంది. ఇక అలాగే డబ్ల్యూటీఏ ముడిచమురు బ్యారెల్ కు 0.08 శాతం తగ్గి 39.8 డాలర్లకు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయ మారకపు విలువ డాలర్ తో పోలిస్తే 17 పైసలు లాభపడి 76.03 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది. నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లు కాస్త మిశ్రమంగా ముగిసాయి. ఒక్క నిఫ్టీ ఐటీ మినహా మిగతా ఇండెక్స్‌ లు అన్నీ కూడా లాభలలో ముగిసాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: