ఏం కరోనా ను ఏంటో, పైప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయ్. ఈ వైరస్ ఎప్పుడు ఎవరికి ఏ విధంగా సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం జనాల్లో తప్పనిసరిగా తిరగాల్సిన ప్రజా ప్రతినిధులు కూడా ఇప్పుడు కరోనా బారిన పడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సామాన్య జనాలు, వర్తక వాణిజ్య, వ్యాపారాలు చేసుకోకపోతే నోట్లోకి ముద్ద వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఒక వైపు కరోనా భయం వెంటాడుతున్నా, ఆకలి బాధను తీర్చుకునేందుకు, కుటుంబాన్ని పోషించుకునేందుకు తప్పనిసరిగా, రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి లాక్ డౌన్ విషయంలో సమర్థవంతంగా సేవలందిస్తూ వస్తున్న పోలీసులు కూడా ఇప్పుడు ఈ కరోనా ప్రభావానికి కురవుతుండడం  ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులతో పాటు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఇలా అత్యవసర సేవల్లో ఉన్న వారందరూ ఈ ప్రభావానికి గురవుతున్న సంఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

IHG


 ఇక తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరిగిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న తీరు ఆ శాఖ సిబ్బందిలో భయాందోళనలకు కారణమవుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్ శాఖలో 190 మందికి పైగా ఈ వైరస్ ప్రభావానికి గురి అయినట్లు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి హోంగార్డ్స్ ఈ ప్రభావానికి గురయ్యారనే విషయం భయాందోళనలు రేకెత్తిస్తోంది. పోలీస్ శాఖలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కారణంగా, వారికి చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

 

కాకపోతే అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో పాటు వైద్య ఖర్చులకు రియంబర్స్మెంట్ అవకాశం లేని కారణంగా, చాలామంది హోమ్  క్వారంటైన్  లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇక ఐపీఎస్ అధికారులు కూడా దీనికి అతీతం ఏమీ కాదు. ఇప్పటికే ఏడుగురు ఐపీఎస్ అధికారులకు ఈ వైరస్ సోకినట్టుగా తేలింది. వీరి దగ్గర పనిచేస్తున్న డ్రైవర్లు, ఇతర సహాయ సిబ్బంది కారణంగా వారు కరోనా బారిన పడినట్లుగా పోలీస్ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో మరింత మందికి ఈ వ్యాధి సోకకుండా తెలంగాణ డీజీపీ ఆఫీస్ తో పాటు, కమిషనరేట్లో పెద్దఎత్తున కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. 


ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, సరైన చికిత్స తీసుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవల విభాగంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్న పోలీసులు ఈ ప్రభావానికి గురవుతుండడంతో ఆ శాఖలో కలకలం రేగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: