ఎంత గొప్ప గుణాలు కలిగి ఉన్నవారినైనా వ్యసనాలు నాశనం చేస్తాయి. ఒక వ్యక్తి వ్యసనం భారీన పడితే ఆ వ్యక్తి మాత్రమే నాశనం అవుతాడు. ఒక రాజ్యాన్ని పాలించే రాజు వ్యసనాల భారీన పడితే మాత్రం ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం నేపాల్ దేశాన్ని తలచుకుంటే ఈ మాటలు అక్షర సత్యం అనిపిస్తాయి. సంసృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు లాంటి దేశం అయిన నేపాల్ ప్రజలను చైనాకు ఆ దేశ ప్రధాని ఓలీ శర్మ తాకట్టు పెట్టారు. 

 

నేపాల్ ప్రధాని చైనాను అతిగా నమ్మటం, అరాచకాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంతో పాటు చైనా రాయబారి మాయలో పడి ప్రధాని వ్యసనాలకు బానిసయ్యారు. ఏడాది క్రితమే పదవి దిగిపోవాల్సి ఉన్నా చైనా ప్రోద్భలం వల్ల ఈయనే ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో ఓలీ శర్మ చైనా చెప్పిన మాటే వేదం అనే స్థితిలోకి వెళ్లాడు. చైనా చేతిలో కీలుబొమ్మగా మారడం వల్లే నేపాల్ భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. 

 

చైనా చేతిలో ప్రధాని కీలుబొమ్మలా మారిపోవడంతో ఆ దేశంలో ప్రజల జీవోనాపాధి దెబ్బ తింది. ఆ దేశ ప్రయోజనాలు నాశనమయ్యాయి. ఆ దేశ భౌగోళిక పరిస్థితులు సైతం నాశనమవుతున్నాయి. నేపాల్ లో చైనా భాష పాఠ్యాంశాలు నేర్పిస్తున్నారంటే ఆ దేశంలో ఏ విధమైన పరిస్థితులు నెలకొన్నాయో సులభంగానే అర్థమవుతుంది. ఈ పరిస్థితులను అడ్డం పెట్టుకుని చైనా దుర్మార్గపు చర్యలను ప్రారంభించింది. 

 

చైనా నేపాల్ నార్త్ గూఖాలో ఉన్నా రూహీ గ్రామాన్ని కబ్జా చేసింది. సరిహద్దు ప్రాంతాలు చైనా చేతిలోకి వెళ్లిపోయాయి. చైనా కబ్జా చేసినా నేపాల్ సైలెంట్ గానే ఉంది. 70 ఏళ్ల క్రితం చైనా భారత్ లోని భూభాగాలను కబ్జా చేసింది. అప్పటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ విషయం తెలిసి పచ్చగడ్డి కూడా మొలవని భూమి అంటూ వ్యాఖ్యలు చేశారు. చైనా కొన్ని దేశాలతో స్నేహం చేసి భూ కబ్జాలు చేస్తుంటే మరికొన్ని దేశాల్లో భూములు కబ్జా చేయడానికే వివాదాలు సృష్టిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: