ప్రస్తుతం చైనా భారత్ పై ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా యుద్ధం  చేస్తుంది. ఓవైపు స్వయంగా చైనా భారత్ పై  యుద్ధం చేయడమే కాదు తన మిత్ర దేశాలతో కూడా పరోక్షంగా యుద్ధం చేయిస్తోంది చైనా . అదే సమయంలో భారత దేశంలో కూడా కొంతమంది ఏకంగా భారత దేశం పైన పరోక్షంగా యుద్ధం చేస్తున్నారు కూడా. అయితే చైనా తమ సైన్యాన్ని కేవలం ఆయుదాలతోనే కాకుండా బయోవార్ కోసం కొంతమంది... సోషల్ మీడియా వార్ కోసం  కొంతమందిని సైబర్ వార్ కోసం  కొంతమందిని విభాగాలు ఉండేలా ట్రైనింగ్ ఇస్తూ  ఉంటుంది. ప్రస్తుతం భారత్ పై సైబర్ వార్ కి  కూడా చైనా సిద్ధమైందని అంటున్నారు విశ్లేషకులు. 

 


 చైనా దెబ్బకి భారత్ మొత్తం వణికిపోయింది.. చైనా సైనికులతో పోరాడలేక భారత సైనికులు పారిపోయారు అని ఒక ప్రచారం మొదలు పెట్టింది చైనా . పాకిస్తాన్ చైనా లలో  కూడా దీనిపై ఏకంగా వేల మంది పని చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఓవైపు భారత్ కావాలని భూమిని వదిలేశారు అని ఒక వైపు నుంచి ప్రచారం చేస్తూ ఉంటే... మరోవైపు భారత్ కావాలని భూమి ఆక్రమించారు మరో వైపు నుంచి ప్రచారం చేస్తారు. ఇలా మానసికంగా పరోక్షంగా యుద్ధం చేస్తోంది పాకిస్తాన్ చైనా. 

 


 ఇక మన భారతదేశం విషయానికి వచ్చేసరికి ఇలాంటి ఆలోచన మాత్రం చేయడం లేదు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందామని అంటుంది . ఇలా ఇతర దేశాలతో కలిసి పరోక్షంగా మానసికంగా యుద్ధం మాత్రం చేయడం లేదు భారత్. దొంగ ఐడిలు  సృష్టించి ఇలాంటి విమర్శలకు దిగడం లేదు. చైనా బయో వార్ కి కారణం  మన దేశంలో మేధావులుగా  ఉన్నటువంటి వారు ఏకంగా భారతదేశాన్ని విమర్శిస్తూ ఉండడం అని  అంటున్నారు విశ్లేషకులు. దీంతో అటు పాకిస్థాన్ చైనా దేశాలు కూడా మరింత రెచ్చిపోయి భారత్ పై  తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: