చైనా గత కొన్ని రోజుల నుంచి గాల్వన్  లోయ పైన కన్నేసి దాని కోసం భారత్తో ఘర్షణను పడుతున్న విషయం తెలిసిందే. భారత్ కు  చెందిన సైనికులు చనిపోవడం కూడా సంచలనంగా మారింది. గాల్వన్ ఘర్షణకు మొదటి స్టెప్ అయితే వేసింది కానీ ఆ తర్వాత ఎలాంటి స్టెప్ వెయ్యాలి అన్న అయోమయంలో ప్రస్తుతం చైనా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. ఎలాంటి స్టెప్ వేస్తే  ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని  కాస్త ఆందోళనలో ఉంది చైనా. అయితే అటు చైనా నే కాకుండా నేపాల్ ని  తన మిత్ర దేశంగా మార్చుకుని  నేపాల్ ద్వారా భారత పై  విమర్శలు గుప్పించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 

 


 ఈ నేపథ్యంలో నేపాల్ లోని ప్రజలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా చేపట్టడం మొదలుపెట్టారు. అయితే ఇది భారత్ వెనకుండి ఉద్యమాలు చేపిస్తుంది అని చైనా భావిస్తోంది. ఇదిలా ఉంటే అటు చైనాలోనే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ఉద్యమ బాట పడుతున్నారు. భారత్లో సైనికులు కి అంతిమ నివాళి ఘనంగా అర్పిస్తే అదే చైనా సైనికులకు మాత్రం ఎంత మంది చనిపోయారో  కూడా చెప్పకుండా రహస్యంగా  ఉంచుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. 

 

 

 అయితే  వీటితోనే చైనాకు పెద్ద తలనొప్పి మొదలైంది అని అనుకుంటున్న తరుణంలో అటు బంగ్లాదేశ్ నుంచి కూడా చైనాకు సరికొత్త తలనొప్పి మొదలైంది. ఇప్పటికీ చైనా బంగ్లాదేశ్ తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అటు బంగ్లాదేశ్ లో  చైనా తీరుకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాకు మద్దతుగా కాకుండా వ్యతిరేకం గా ఉండాలని అక్కడి ప్రజలు ఉద్యమాలు  చేపడుతున్నారు. ఎందుకంటే చైనాలో ముస్లింలను కించపరుస్తూ ఉన్నారు అంతేకాకుండా కూడా మసీదును కూల్చి వేస్తున్నారని అట్లాంటి దేశంతో సానుకూలంగా సంబంధాలు ఉండేందుకు అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దీనిపై చైనా ఎలాంటి ముందడుగు వేస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: