చైనా భారత్ సరిహద్దులో గత కొంతకాలంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా మొన్నటికి మొన్న చైనా సైనికులు మూకుమ్మడిగా భారత సైనికుల పై దాడి చేయడంతో వేగంగా భారత సైనికులు 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే.  ఇది దేశవ్యాప్తంగా ఎంతో సంక్లిష్టంగా మారిపోయింది. అయితే అటు చైనా దేశానికి సంబంధించిన సైనికులు కూడా ఎంతో మంది చనిపోయారు. అయితే ఈ ఘర్షణలో  భారత్లో చనిపోయిన  సైనికుల గురించి భారత్ అధికారికంగా ప్రకటించి వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా జరిపించింది. కానీ చైనా మాత్రం తమ సైనికులు ఎంతమంది చనిపోయారు అనే విషయాన్ని బయట పెట్టలేదు. దీంతో సీక్రెట్గానే ఉంచింది చైనా సైనికుల మరణాన్ని. 

 


 ఈ నేపథ్యంలో భారత సైనికుల కంటే చైనా సైనికులు ఎక్కువ మంది చనిపోయారా  తక్కువ మంది చనిపోయారా  అనే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో చైనాలో ఏకంగా  కొన్ని ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం చైనా కి భారీ మొత్తంలో పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాకుండా వెనుకడుగు వేయడంతో దాని అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు అక్కడివాళ్లు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. అంతేకాకుండా చైనా ప్రధానమంత్రి అధ్యక్షుడు జిన్ పింగ్ కి మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తుంది గత కొంత కాలంగా. 

 


 అక్కడ పేద ప్రజలకు ఇచ్చిన రుణాల విషయంలో ప్రధానమంత్రి సానుకూలంగా ఉంటే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రం ఇలా రుణాలు ఇవ్వడం వల్ల దేశంలో ఎంతో నష్టం వాటిల్లుతోంది అంటూ చెప్పడం. అంతే కాకుండా శాశ్వత అధ్యక్షుడిగా జంన్ పింగ్ ఉండడం కూడా అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రోజురోజుకు ఉపాధి అవకాశాలు తగ్గుతూ ఉండటం.. ప్రపంచ దేశాలు మొత్తం చైనా దేశానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ ఉండటం.. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో అక్కడి ప్రజలు ఉద్యమ బాట పడుతున్నారు.దీంతో  ఇవన్నీ డ్రైవర్ చేయడానికే ఇలా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: