ఒకసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వైపు ప్రభుత్వాన్ని మరోవైపు పార్టీని సమన్వయం చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పార్టీని ప్రభుత్వాన్ని రెండు పట్టాల మీద నడిపించడంలో ఫెయిల్ అయితే మాత్రం ఎన్నో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. సొంత పార్టీ నుంచి ఎన్నో  నిరసన సెగలు తగులుతాయి .ఇవి ఎక్కడ వరకూ దారితీస్తుంది అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి గా ఉంటుంది. ఒకవేళ పార్టీ నేతలకు అధినేతకు మధ్య గ్యాప్ వచ్చింది అంటే ఎన్నో నిరసన సెగలు తెరమీదికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటిదే జరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు. 

 

 ధర్మాన ప్రసాదరావు,  ఆనం కృష్ణారావు,  బ్రహ్మారెడ్డి రఘురామకృష్ణంరాజు వీరందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో పార్టీ అధినేతపై పార్టీ తీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వీరిలో మిగతా ముగ్గురు మొదట్లో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం కాస్త సైలెంట్ గానే ఉండిపోయారు. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం మొదటి నుంచి సొంత పార్టీలోనే సమరం చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజు విమర్శించడం కోసం వైసిపి పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. 

 


 రఘురామకృష్ణంరాజు ఒక పవర్ ప్లాంట్ తీసుకున్నారని ఆ  పవర్ ప్లాంట్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించకపోవడంతో రఘురామకృష్ణంరాజు ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. రఘురామకృష్ణంరాజు మాత్రం తనకు పవర్ ప్లాంట్ లో ఎలాంటి సంబంధం లేదు అని చెబుతున్నారు. ఇలా రోజురోజుకి అసంతృప్తి సెగలు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అని అర్థమవుతుంది. రోజుకు పది మంది ఎమ్మెల్యేలకు అధినేత జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ రాకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: