ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పెద్ద ఎత్తున నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరగడమే కాదు, దానికి తగ్గట్టుగా పార్టీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలవరానికి గురిచేస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికలు ముగియడంతో, పెద్దఎత్తున నాయకులు వలస బాట పట్టే అవకాశం ఉన్నట్లుగా వస్తున్న వార్తలతో చంద్రబాబు తీవ్ర మానసిక ఆందోళనలు ఉన్నారు. ఇక అధికార పార్టీ కూడా పెద్దఎత్తున వలసలను ప్రోత్సహించి, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇలా ఉండగానే సెంటర్ ఫర్ సెపాలజి స్టడీస్ ( సిపిఎస్) అనే సంస్థ ఏపీలో సర్వే నిర్వహించింది.

 

IHG


 ఈ సర్వేలో ఏపీ సీఎం జగన్ ఏడాది పాలనా, పనితీరు తో పాటు ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరికి అధికారం దక్కుతుంది అనే అంశాలపై జూన్ 2 నుంచి ఎనిమిదో తేదీ మధ్య లో 13 జిల్లాల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జగన్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపడంతో, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతోంది. ముఖ్యమంత్రి జగన్ పనితీరుపై 62.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 36.1 శాతం మంది ప్రభుత్వ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇక గోదావరి జిల్లాలో 55.8 శాతం మంది జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అమరావతి ప్రాంతంలో 54.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలు తేలడంతో పాటు, తెలుగుదేశం పార్టీకి 38.3 శాతం ఓట్లు మాత్రమే దక్కుతాయని ఈ సర్వే తేల్చింది.


 ఇక జనసేన, బిజెపి కూటమికి 5.3 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఇదిలా ఉంటే ఈ సర్వే ఫలితాలు వెలువడిన తర్వాత ఒక్కసారిగా టిడిపి శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ ఏడాది పాలనపై తాము ఎన్నో ఉద్యమాలు చేశామని, పార్టీ అధిష్టానం ఆదేశించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంతున్నామని, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందని, పదే పదే జనాల్లో ప్రచారం చేసినా, ఈ సర్వేలో జగన్ పనితీరుపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే షాకింగ్ రిజల్ట్ బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు మరింత నిరుత్సాహానికి గురవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: