ప్రస్తుతం ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువులను ఎక్కడికక్కడ బ్యాన్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తీరు మాత్రం మరొక లాగా ఉందని ఇప్పుడు జాతీయ మీడియా వర్గాలు అసహనం ప్రదర్శిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఒప్పందాలను అకస్మాత్తుగా నిలిపివేసి చైనా కంపెనీలకు షాక్ ఇచ్చింది. కానీ ఇప్పుడు దాదాపు 50,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను హోం మినిస్ట్రీ మన సైనికుల కోసం ఆర్డర్ తీసుకుంటుండగా అవి చైనాలోని మెటీరియల్స్ నుండి తయారు చేయబడినవి కావడం గమనార్హం.

 

ఇదిలా ఉండగా అసలు మోసం ఎక్కడ జరిగింది అంటే… 2019లో 639 కోట్ల రూపాయలు భారత ఆర్మీ సదరు జాకెట్ తయారీ విక్రేత కు చెల్లించగా వారు ముందుగా జాకెట్ తయారు చేసేందుకు ముడిసరుకులు సప్లై చేసేది పశ్చిమ దేశాలైన యురోపియన్ ప్రాంతాలు మరియు అమెరికా అని చెప్పాయి. అయితే ఎప్పుడైతే సప్లయర్ భారత్ నుండి కాంట్రాక్టు దక్కించుకున్నారో తర్వాత ముడి పదార్థాలు సప్లై చేసే కంపెనీని వారి సొంత ఒప్పందాల ప్రకారం చైనాకు ఇచ్చేశారు. అలా ఇప్పుడు భారతదేశానికి వచ్చే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అన్ని చైనా వారు తయారు చేసేవే. ఇప్పుడు కనుక మన దేశం చైనా నుండి వచ్చే పదార్థాలు మాకు వద్దు అనుకుంటే చెల్లించిన డబ్బులు మొత్తం నష్టం అవుతుంది అని చెప్పాలి.

 

డిఫెన్స్ మినిస్ట్రీ దాదాపు 1,80,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఎల్ఏసీ వద్ద గస్తీ కాస్తున్న ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్ మరియు అతి కీలకమైన సీఆర్పీఎఫ్ జవాన్ లకు అందిస్తారు. దాదాపు మూడు టెండర్ల నుండి నెల ఆఖరి లోపల 1,80,000 జాకెట్లను డెలివరీ ఉండగా అది తయారు చేసేందుకు అత్యవసరమైన మరియు అతి ముఖ్యమైన పదార్థం యొక్క సప్లయర్ చైనా కంపెనీలు కావడం గమనార్హం. అయితే ఇప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం కానీ డిఫెన్స్ మినిస్ట్రీ గాని దిగుమతిని ఆపలేదు.

 

ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మెటీరియల్ లో దాదాపు 40 శాతం ఉండే ఫాబ్రిక్ మరియు బోరాన్ కార్బైడ్ పౌడర్ కూడా చైనా నుంచి దిగుమతి చేసుకున్నదే. అసలు చైనా నుండి తమకు ముడి పదార్థం వస్తుందని ముందు విక్రేత ఎందుకు దాచినట్లు? పశ్చిమ దేశాల పేర్లు చెప్పి ఎందుకు మోసం చేసినట్లు?

మరింత సమాచారం తెలుసుకోండి: