వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన మరియు వైసీపీ పార్టీ పైన విపరీతమైన ఆరోపణలు చేసిన రఘురామకృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని పార్టీ నాయకులతో గొడవ పెట్టుకున్న విషయం కూడా తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈయన పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కి తనకు ప్రాణహాని ఉందని తన జిల్లా వైసీపీ కార్యకర్తలు మరియు నాయకులు పైన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

 

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మరియు అత్యంత మెజారిటీ కలిగిన పార్టీ యొక్క సభ్యులపై విపరీతమైన ఆరోపణలు చేసి మరియు వారి పార్టీలోనే ఉంటూ వారిని విమర్శిస్తే కార్యకర్తల నుండి ఇటువంటి వార్నింగ్ లు రావడం సహజం. ఇన్నేళ్లు రాజకీయ జీవితంలో ఇది ఎంపీ గారికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా తనకు భయం ఉంటుంది కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కోరడం మంచి విషయమే.

 

అయితే పోలీసులు అసలు ఫోన్ చేసిన వారు ఎవరు మరియు ఈయనకు ఎటువైపు నుండి ప్రాణ హాని ఉంది అని తెలుసుకొని రియాక్ట్ అయ్యేలోగా పోలీసులు కేసును పట్టించుకోవడంలేదని ఈయన గగ్గోలు పెట్టడం మాత్రం జిల్లాలోని అందరికీ చిరాకు పుట్టిస్తోందట.

 

అదేమన్నా అంటే తనను చంపేస్తానంటూ బెదిరించిన వారిపై ఫిర్యాదు చేసిన స్థానిక పోలీసులు పట్టించుకోలేదని చెప్పిన ఆయన తను అంతా అమిత్ షా కు వివరించానని అంతేకాకుండా ఆయనకు కేంద్ర బలగాలను రప్పించేందుకు అన్ని సన్నాహాలు సిద్ధమైనట్లు ఎంపీ గారు కోతలు కోయడం నిజంగా చాలా విడ్డూరం. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి బలగాలు పంపిస్తే అసలు అతని పై ఎటువంటి అటాక్ జరగబోతోంది అన్న వార్నింగులు వచ్చాయి అని ప్రజలు ఆలోచనలో పడతారు.

 

ఇక ఇటు చూడబోతే ఒకవేళ బెదిరింపు కాల్స్ నిజమైతే వివరాలను రాష్ట్ర పోలీసు శాఖకే అందించవచ్చునని కూడా వైసీపీ వారు చెబుతున్నారు. రఘురామ కృష్ణంరాజు సెల్ఫ్ స్క్రీన్ ప్లే తో ఇలాంటి నాటకాలాడుతున్నారని వైసిపి నాయకులు విమర్శిస్తున్నారు.

 

ఇంతకీ రాజుగారికి ఇలా ప్రాణభయం తన్నుకొచ్చేలా ఆయన పై ఆ భయానక వార్నింగ్ లతో అటాక్ చేసింది ఎవరు? అతనికి ఎంత గట్టిగా వార్నింగ్ ఇవ్వకపోతే అతను క్షణాల్లో పోలీసులని ఆశ్రయించి వారిపై నమ్మకం లేదని కేంద్ర బలగాల దాకా వెళ్తారు. నిజంగా ఆయన అన్నత్లు గూండాలు అతనిని సీరియస్ గా అటాక్ చేస్తారా? 

మరింత సమాచారం తెలుసుకోండి: