భారత్ లో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రాణాంతక వైరస్ తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా విస్తరిస్తోంది. ఇక కేసుల తీవ్రతను బట్టి వివిధ రాష్ట్రాల్లో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దశ (అనగా సంఘంలో ఒకరి నుండి ఒకరికి సులువుగా ప్రబలడం) మొదలైందని కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందు దీనిని తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ కొట్టిపారేసినా…. తాజా సర్వేలో బయటకు వచ్చిన విషయాలు చాలా సంచలనాత్మకంగా ఉన్నాయి.

 

దేశవ్యాప్తంగా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ (143%) తొలి స్థానంలో ఉండగా తెలంగాణ(122%) రెండో స్థానంలో ఉంది. ఇక, మరో తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ జాబితాలో చివరి స్థానాల్లో ఒకటి దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ కు ముప్పు కేవలం 8 శాతం ఉండడం ఊరటనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి తీసుకుంటోన్న చర్యలు బాగున్నాయని, ఏపీలో అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్నారని జాతీయ స్థాయి వైద్య, ఆరోగ్య నిపుణులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

 

ఇక కరోనా ప్రబలిన తరువాత చాలా రోజుల వరకూ తెలంగాణలో చాలా ఘోరంగా టెస్టింగ్ జరగడం దీనికి మొదటి కారణం అంటున్నారు నిపుణులు. అనేకసార్లు రోజుకి 200 లోపు కరోనా టెస్టులు తెలంగాణలో జరగడం గమనార్హం. ఇలా తగిన స్థాయిలో టెస్టింగ్ జరపపోవడం వల్లే ఇప్పుడు కంపెనీ కమ్మ్యూనిటీ ట్రాన్స్మిషన్ కు దారితీస్తుందని చెబుతున్నారు

 

అంతెందుకు గత 24 గంటల్లోనే తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 872.. ఏడుగురు చనిపోయారు. ఇది నిన్నటి కేసులు సంఖ్యతో పోలిస్తే దాదాపు రెట్టింపు. దీనికన్నా వేరే ఉదాహరణ కావాలా? మరి కెసిఆర్ గారు గతంలో నాలుగు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి తనను టెస్టుల విషయమై ప్రశ్నించే వారిని చెడామడా పబ్లిక్ గా తిట్టడం.. మీరెవరు చెప్పడానికి అన్నట్లు మాట్లాడడం చేసిన సందర్భాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎంతైనా కెసిఆర్ చెప్పిన 'బంగారు తెలంగాణ' మాట అటు ఉంచితే అది కాస్తా చివరికి ఎప్పుడేమవుతుందో తెలియని 'కంగారు తెలంగాణ' అయి కూర్చుంది.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: