తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా ఉదృతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో కేంద్రంపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పై ఇటీవల వరుసగా బిజెపి నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో తెలంగాణ బిజెపి నాయకులకు మరియు టిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య కరోనా వైరస్ విషయంలో తీవ్ర మాటల యుద్ధం కొనకపోతే తీవ్రతరం అవుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వైరస్ నియంత్రణ కోసం కేంద్రం రాజకీయ డ్రామాలు ఆడుతున్నట్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే కరోనా నియంత్రణ కోసం చికిత్సకోసం కేంద్రం ఏమాత్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అంటూ చేతులు దులుపుకుందని సెటైర్లు వేశారు. అంతేకాకుండా కరోనా నిర్ధారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న టెస్టింగ్ మిషన్ లను కేంద్రం వేరే రాష్ట్రాలకు తరలిస్తుందని ఆయన ఆరోపించారు. కరోనా పేరుతో బీజేపీ నాయకులు కంపు రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో నిబద్దతతో పనిచేస్తుంటే, బిజెపి నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

 

అంతే కాకుండా కేవలం ఇప్పటివరకు 214 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా రోజుకి 3,500 నుంచి 4,000 పరీక్షలు చేయగల సామర్థ్యం ఉన్న రోస్‌ కంపెనీకి చెందిన కోబొస్‌ 8,800 మిషన్లను దేశంలో తొలిసారిగా ఆర్డర్‌ చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు.  ఈ నేపథ్యంలో ఇండియాలో ఆ మిషన్లు వచ్చిన వెంటనే కేంద్రంలో ఉన్న పెద్దలు వాటిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి పంపించారని ఆరోపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: