వైయస్ జగన్ రాజకీయంగా ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటాడో అదే స్థాయిలో సోషల్ మీడియాలో కూడా క్రేజ్ పరంగా సినిమా హీరోలకు పోటీ ఇచ్చేలా ఉంటాడు. ఇటీవల ఆయన ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ కార్యకర్తలు జగన్ అభిమానులు సరికొత్త రికార్డులు సృష్టించారు. సాధారణంగా రాజకీయ నాయకులకు పెద్దగా అభిమానులు ఉండరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ జగన్ పొలిటికల్ ఫీల్డ్ లోకి దిగాక...పొలిటికల్ లీడర్ లకి కూడా అభిమానులు ఉంటారు అని రుజువు చేశాడు. ఇటీవల కరోనా వైరస్ వచ్చిన టైములో గాని లేకపోతే అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న టైములో గాని జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా మందిని ప్రభావితం చేశాయి.

 

ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళుతున్న సమయంలో ప్రభుత్వ పరంగా వారికి భోజనాలు పెట్టి కాళ్ళకి చెప్పులు ఫ్రీ గా ఇచ్చి డబ్బు సాయం కూడా చేశారు. దీంతో జగన్ క్రేజ్ దేశవ్యాప్తంగా వ్యాపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాలలో ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అద్భుతంగా పరిపాలిస్తున్నాడు అని సోషల్ మీడియాలో తెగ పొగుడుతూ వీడియోలు మీద వీడియోలు పోస్ట్ చేస్తున్నరు. ఇదిలా ఉండగా ఇటీవల తమిళ స్టార్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా రాబోయే రోజుల్లో వైయస్ జగన్ మాదిరిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి జగన్ మాదిరిగా విజయం సాధించాలని జగన్ మరియు విజయ్ ఫోటోలను తమిళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏర్పాట్లు చేసి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.

 

జగన్ మాదిరి పరిపాలన విజయ్ అందించాలని రాజకీయాల్లోకి రావాలని విజయ అభిమానులు చాలా చోట్ల జగన్ విజయ్ ఫోటోలను ఏర్పాట్లు చేయటం ఇప్పుడు తమిళ రాజకీయాలు పెను సంచలనంగా మారింది. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి సమయంలో ఇప్పటికె రజనీకాంత్ మరియు కమల్ హాసన్ లాంటి వారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇలాంటి తరుణంలో విజయ్ కూడా రాజకీయాల్లోకి రావాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం పెను సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: