ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కలకలమే కనిపిస్తోంది. మీడియాలోనూ అదే జోరు కనిపిస్తోంది. కరోనా వార్తలు.. కరోనా అక్కడ వచ్చింది.. కరోనా ఇక్కడ వచ్చింది. కరోనా ఇన్ని కేసులు.. కరోనా అన్ని మరణాలు.. కరోనా ఇవీ జాగ్రత్తలు.. కొన్ని రోజులుగా ఏ పత్రిక తిరగేసినా.. టీవీ చానల్ పెట్టినా ఇవే వార్తలు.. ఏం చేస్తాం ఇది కరోనా కాలం కదా.

 

 

ఇక్కడ విచిత్రం ఏంటంటే.. కరోనా వార్తలపై ఆయా మీడియా వర్గాల్లో వివక్ష కూడా ఉంటుంది. అంటే తమకు సంబంధించిన వార్తలు మాత్రం ఆయా మీడియాల్లో రావు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా రాసే వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు.. తమ మీడియాలో జరుగుతున్న అన్యాయాలపై మాత్రం నిశబ్దం పాటిస్తాయి. మొన్నటికి మొన్న జీతాల్లో కోతలు, ఉద్యోగాల ఊస్టింగుల విషయంలో అదే జరిగింది.

 

 

ఇప్పుడు కరోనా విషయంలోనూ అదే జరుగుతోంది. తెలుగులో అగ్రశ్రేణి పత్రికగా చెప్పుకునే ఓ పత్రిక కార్యాలయంలో ఏకంగా 16 మంది వరకూ కరోనా పాజిటివ్ గా తేలినట్టు మీడియా సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది. ఆ సంస్థ ఉద్యోగులూ అదే చెబుతున్నారు. కానీ ఈ వార్త మాత్రం ఆ పత్రికలోనే కాదు.. మిగతా పత్రికల్లోనూ కనిపించదు. ఆ సంస్థ మాత్రమే కాదు. మిగిలిన మీడియా హౌజుల్లో కూడా కరోనా కేసులు వస్తున్నాయి.

 

 

కానీ ఆ వార్తలు మాత్రం మీడియాలో రావడం లేదు. అంటే.. మీడియా సంస్థల్లో పని చేసేది మాత్రం మనుషులు కారా.. వారి వార్తలు ప్రజలకు అవసరం లేదా.. పాపం.. ప్రపంచంలో ఎక్కడ ఏ వార్త జరిగినా దాన్ని ప్రపంచానికి అందించడంలో ముందుడే జర్నలిస్టులు వారి వార్తలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. తమకు జరిగే అన్యాయాలు మాత్రం మౌనంగానే భరిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: