చైనా సైనికులతో ఇటీవల జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన తెలుగు తేజం కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆయన భార్యకు ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తానని ప్రకటించింది. అయితే గ్రూప్ 1 అంటే అందులో చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి. డిఫ్యూటీ కలెక్టర్ గ్రూప్ 1 ఉద్యోగమే.. అలాగే ఎంపీడీవో కూడా గ్రూప్ వన్ ఉద్యోగమే.

 

 

అయితే తెలంగాణ ప్రభుత్వం కర్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా నియమించినట్టు తెలుస్తోంది. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ అయినట్టు సమచారం. ఈ విభాగంలో ఉద్యోగం అంటే వైట్ కాలర్ జాబ్ వంటింది. గ్రూప్ వన్ సాధించిన చాలా మంది అభ్యర్థులు ఆర్డీవో గానీ.. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ పోస్టు కోరుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మంచి పోస్టునే సంతోషికి కట్టబెట్టింది.

 

 

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన స్వయంగా సంతోషికి నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన సూర్యాపేటకు స్వయంగా వెళ్లి సంతోష తల్లి,తండ్రి మంజుల ,ఉపేందర్, సంతోష్ సతీమణి సంతోషిణిలతో మాట్లాడి వారిని ఓదార్చే యత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటించిన విధంగా ఐదు కోట్ల రూపాయల ఆర్దిక సాయం, హైదరాబాద్ లో 700 గజాల నివేశన స్థలం పత్రాలు అందించారు.

 

 

సీఎం కేసీఆర్ తొలుత సంతోష చిత్రపటానికి ఆయన నివాళి అర్పించారు. కెసిఆర్ కోవిడ్ నిబంధనలు పాటించి, టిఆర్ఎస్ నేతలు ఎవరిని రావద్దని తెలిపారు. కేవలం నలుగురితోనే ఆయన సూర్యాపేట వెళ్లారు. సీఎం వెంట విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: