ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది కరోనా వైరస్.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా వల్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కన్నీరు పట్టుకుంటున్నారు.  కరోనా  ఆర్థిక, ప్రాణ నష్టంతో కరాళ నృత్యం చేస్తుంది.  భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 14,821 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 445 మంది మరణించారు.   ఇప్పటివరకు మొత్తం 4,25,282కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 13,699కి పెరిగింది. 1,74,387 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

 

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,37,196 మంది కోలుకున్నారు.  కరోనా కనిపించని మాయదారి మహమ్మారి మనిషి మంచి ఆరోగ్యంగా కనిపస్తూనే ఉంటారు.. కానీ వైరస్ లక్షణాలు బయట పడే వరకు తెలియని పరిస్థితి.  మొన్నటి వరకు కరోనా ని తగ్గించడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో రెండు నెలల అన్ని శుభకార్యాలు బంద్ అయ్యాయి. ఈ మద్య లాక్ డౌన్ సడలించిన విషయం తెలిసిందే.  దాంతో శుభకార్యాలు మొదలయ్యాయి.. నియమనిబంధనలు పాటిస్తూ కానీ కొన్ని చోట్ల మాత్రం కేసులు నమోదు అవుతున్నాయి.   పరిమిత సంఖ్యలోనే అతిథులు వస్తున్నా కరోనా మాత్రం వదలడం లేదు. ఏదో ఒక చోట కలవరం సృష్టిస్తూనే ఉంది. తాజాగా కర్నాటకలో జరిగిన ఓ పెళ్లిలో కూడా టెన్షన్ పెట్టింది. 

 

వంట మాస్టర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో  నూతన దంపతులతో పాటు కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన వారిని అధికారులు క్వారంటైన్‌కు తరలించాల్సి వచ్చింది.  తుమకూరు జిల్లా హెరూరిలో ఇటీవల పెళ్లి జరిగింది. వధువు ఇంటి వద్దనే నిరాడంబరంగా వివాహం చేశారు. అయితే దానికి వచ్చిన కొద్దిమంది అతిథుల కోసం 55 ఏళ్ల వ్యక్తి వంట చేసిపెట్టాడు. 56 మందిని గుర్తించి క్వారంటైన్ చేశారు. అతడు ఉంటున్న ప్రాంతాన్ని శానిటైజర్లతో శుభ్రం చేశారు. పెళ్లితో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఆ ఇంట్లో కరోనా భయం పట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: