దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ మనుషుల భవిష్యత్తును కూడా నాశనం చేస్తోంది. కరోనా సోకిన వారు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కరోనా సోకకపోయినా పరోక్షంగా వైరస్ మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని మరికొందరు చెబుతున్నారు. పలు సర్వేల్లో సైతం ఈ విషయం స్పష్టమవుతోంది. 
 
డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇటీవల ఎయిమ్స్ ప్రొఫెసర్లు జరిపిన సర్వే వివరాలను పూర్తిగా ప్రచురించింది. కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో దేశానికి ఊబకాయం, మధుమేహం ముప్పు పొంచి ఉందని పేర్కొంది. లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. తగిన వ్యాయామం లేకపోవడంతో బరువు పెరిగే అవకాశం ఉందని.... లాక్ డౌన్ సమయంలో 40 శాతం మంది బరువు పెరిగారని చెప్పారు. 
 
వీరిలో 7 శాతం మంది షుగర్ భారీన పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. వయస్సు, బరువు, లింగం, వ్యాయామ పద్ధతులు, కుటుంబ చరిత్ర ఆధారంగా ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వహించినట్టు ఈ సర్వేలో తేలింది. ఈ సర్వే లాక్ డౌన్ సమయంలో కేవలం 38 శాతం మంది మాత్రమే 45 నిమిషాల పాటు వాకింగ్ కు కేటాయించారని తెలుస్తోంది. మరోవైపు ఊబకాయం ఉన్నవారు కరోనా భారీన పడే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. 
 
సర్వే 30 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా షుగర్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తోంది. షుగర్ కంట్రోల్ లో లేనివారు కూడా వైరస్ భారీన పడే అవకాశం ఉంది. లాక్ డౌన్ సమయంలో 100 మంది నాన్ డయాబెటిక్ రోగులను పరిశీలించగా వారిలో 40 మంది బరువు పెరిగినట్టు 19 మంది బరువు తగ్గినట్టు మిగిలిన వారి బరువులో ఎలాంటి మార్పు లేనట్టు తేలింది. కరోనా, లాక్ డౌన్ మనుషులకు ఊబకాయం, డయాబెటిస్ లాంటి వ్యాధులను బహుమానాలుగా ఇచ్చాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: