ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా ఎవ్వ‌రిని వ‌దిలేలా లేదు. ఇక క‌రోనా క్రీడా రంగంలో కూడా పెను ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. చైనా నుంచి మొద‌లైన క‌రోనా ఇప్పుడు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ లాడిస్తుండ‌డంతో పాటు క్రీడా రంగాన్ని కూడా ఓ కుదుపు కుదిపేసింది. సామాన్యుడి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎంతో మంది ఈ వైర‌స్ భారీన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే సెల‌బ్రిటీల్లో కూడా ఎంతో మంది ఈ వైర‌స్ భారీన ప‌డి చ‌నిపోయారు. వైర‌స్ వ‌ల్ల క్రీడా రంగానికి కొన్ని కోట్ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింది. ఈ క్ర‌మంలోనే అస‌లు క్రీడ‌లు ఎప్పుడు మొద‌ల‌వుతాయో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

 

ఇక ఇప్ప‌టికే ఎంతో మంది క్రికెట‌ర్లు, మాజీ క్రికేటర్లు వైరస్ భారిన పడిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ టీం నుంచి ముగ్గురు క్రికెట‌ర్ల‌కు క‌రోనా రాగా, ద‌క్షిణాఫ్రికా టీంలో ఏకంగా ఏడుగురు క్రికెట‌ర్ల‌కు క‌రోనా సోకింది. ఇక ఇప్పుడు ఈ వైర‌స్ మ‌హ‌మ్మారి తాజాగా టెన్నిస్ కు పాకింది. టెన్నిస్ ఆటగాళ్లు బోర్నా కోరిచ్, గ్రిగోర్ దిమిత్రోవ్ లకు పాజిటివ్ అని తేలింది. ప్రపంచ ర్యాకింగ్స్ లో 19వ స్థానంలో కొనసాగుతున్న దిమిత్రోవ్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. 

 

ఇటీవ‌ల జ‌రిగిన మ్యాచ్‌ల‌లో పాల్గొన్న దిమిత్రోవ్ తాను ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నా అనారోగ్యానికి గుర‌య్యాన‌ని.. ప‌రీక్ష‌లు చేయించుకోగా త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయ్యింద‌ని చెప్పాడు. దిమిత్రివ్‌కు పాజిటివ్ రావ‌డంతో ఇప్పుడు ఆయ‌న‌తో క‌లిసి ఉన్న‌ అందరిలోనూ కలవరం మొదలైంది. వీరి ఆటను చూడడానికి వచ్చిన వారు, నిర్వాహకులు, ప్రతినిధుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: