కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషిని కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ (గ్రూప్‌–1 కేడర్‌)గా నియమిస్తూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సోమ వారం రాత్రి జీవో నంబర్‌ 80 జారీ చేశారు.ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె 30 రోజుల్లోగా సం బంధిత శాఖ కమిషనర్‌కు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.ఈ జీవో ప్రకారం సంతోషి వేత నం రూ. 40,270/- –93,780/- వరకు ఉండనుంది. దీనికి అలవెన్స్‌లు అదనం. అయితే సంతోషి ఒకవేళ వేరే పోస్టును కోరుకుంటే ఆ విషయాన్ని రెండు రోజుల్లోగా తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. 

 

సంతోషికి 711 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో నంబర్‌ 59ను సీఎస్‌ విడుదల చేశారు. హైదరాబాద్‌ జిల్లాలోని షేక్‌పేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 6/1, వార్డు నంబర్‌ 10, రోడ్డు నంబర్‌ 14 బంజారాహిల్స్‌లో కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేరు మీద 711 గజాల స్థలం ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.భారత్ చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సోమ‌వారం మిర్యాల‌గూడకు  సీఎం కేసీఆర్ స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించారు.  క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషితో మాట్లాడిన కేసీఆర్‌.. ఆమెకు గ్రూప్ వ‌న్‌ జాబ్ అపాయింట్ ఆఫ‌ర్‌ను అంద‌జేశారు. అంతేకాకుండా కుటుంబానికి అయిదు కోట్ల‌ రూపాయ‌ల చెక్‌ను కూడా అంద‌జేశారు.

 

 జూబ్లీ హిల్స్‌లో 700 గ‌జాల ఇంటి స్థ‌లాల ప‌త్రాల‌ను కూడా సీఎం కేసీఆర్‌.. క‌ల్న‌ల్ సంతోష్ కుటుంబానికి అంద‌జేస్తాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.అమర వీరుడు కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘భారత్‌ టైగర్‌’ బిరుదు ప్రదానం చేయనున్నట్లు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (వామ్‌) ప్రకటించింది. ఈ మేరకు వామ్‌ గ్లోబల్‌ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, కార్యదర్శి పసుమర్తి మల్లికార్జునరావు, కోశాధికారి ఎల్‌.వి.కుమార్‌ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ అనుమతిస్తే సొంత ఖర్చులతో సంతోష్‌బాబుకు తెలంగాణలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: