ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ లో తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకుంది ఈ బ్యాంకు. ప్రైవేట్ రంగంలో ముందంజలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సర్వీస్ లతో కస్టమర్లను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు శుభవార్త అందించిందన్నారు.

 

 

ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చిందని బ్యాంకు యాజమాన్యం తెలిపారు. ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్ సేవలను ఆవిష్కరించిందన్నారు. ఇందులో భాగంగా పేరులోనే ఉన్నట్లుగా కేవలం చదువు కోసం మాత్రమే ఈ రుణం తీసుకోవడం వీలవుతుందన్నారు.

 

 

అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్ కింద రూ.కోటి వరకు రుణం పొందొచ్చునన్నారు. అది కూడా క్షణాల్లోనే లోన్ ఆమోదం లభిస్తుందని యాజమాన్యం తెలిపారు. లోన్ అప్రూవల్ లభించిన తర్వాత కస్టమర్లు ఎప్పుడైనా రుణం పొందొచ్చునన్నారు. లోన్ శాంక్షన్ లెటర్‌తో బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాయంతో సులభంగానే లోన్ తీసుకోవచ్చునని యాజమాన్యం తెలిపారు.

 

 

అయితే ఈ సర్వీసుల వలన లక్షల మంది విద్యార్ధులకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకోవాలని భావించమని యాజమాన్యం వెల్లడించారు. అందుకే ఇన్‌స్టాంట్ అప్రూవల్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ కలిగిన వారికి వెంటనే లోన్ అప్రూవల్ లెటర్ అందిస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ అన్‌సెక్యూర్డ్ అసెట్స్ సుదీప్తా రాయ్ ఈ సందర్బంగా తెలియజేశారు.

 


అయితే లోన్ ప్రత్యేకతలను గమనిస్తే.. కస్టమర్లు వెంటనే లోన్ శాంక్షన్ లెటర్‌ను ఈమెయిల్ పొందొచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదు. ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తంలో 90 శాతం వరకు లోన్ కింద పొందొచ్చు. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అడ్మిషన్‌కు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు మొత్తాన్ని రుణం తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని పదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. లోన్‌పై చెల్లించే వడ్డీ మొత్తంపై 8 ఏళ్ల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చునని యాజమాన్యం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: