దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో రోజురోజుకు భయం పెరిగిపోతూనే ఉంది. దీంతో ఏం చేయాలి  అన్న కూడా ప్రజలు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆలయాలు కూడా తెరుచుకున్న నేపథ్యంలో.. తమ  బాధను చెప్పుకునేందుకు ఎంతో మంది భక్తులు ఆలయాలకు వెళ్తున్నారు. ఆలయానికి వెళ్లిన అక్కడ కూడా కరోనా  వైరస్ భయమే. ఎక్కడ గుడికి వచ్చిన భక్తుల నుంచి కరోనా  వైరస్ సోకుతుందో అని. దీంతో దేవుని సన్నిధిలో కూడా ప్రశాంతత కరువైందా నేటి రోజుల్లో జనాలకి.

 


 దేవుడి చెంత ఉన్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ భయం మాత్రం ఎక్కడా వదలడం లేదు. ఎక్కడ ముట్టుకుంటే కరోనా సోకుతుందో అని  భయపడి పోతున్నారు. ముఖ్యంగా గుడిలో అందరూ ముట్టుకునే  గంట కొడితే కరోనా  వైరస్ అంటుకుంటుందా..?  పూజారి ఇచ్చే  తీర్థం తాగితే ఈ మహమ్మారి వైరస్ సోకుతుందా అనే  అనుమానాలు ప్రస్తుతం అందరినీ వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు గుడికి వచ్చి ప్రశాంతంగా తీర్థం తీసుకునే విధంగా మంగుళూరుకు చెందిన  ప్రొఫెసర్ ఓ వినూత్న ఆలోచన చేశారు. గుడిలో పూజారి చేతులతో తీర్థం ఇస్తే ఎక్కడ కరోనా  సోకుతుందో అని భయపడుతున్న జనాలకు  ఇది ఒక తీపి వార్త అని చెప్పాలి.

 

 ఇకనుంచి తీర్థం పూజారి ఇవ్వటం  కాదు మెషిన్ ఇస్తుంది. పూజారి ఓ బిందెలో  తీర్థం పోస్తే చాలు యంత్రమే భక్తులకు పంచుతుంది. మంగళూరుకు చెందిన సంతోష్ అనే ప్రొఫెసర్ దీన్ని కనుగొన్నాడు. అయితే దీన్ని తయారుచేయడానికి 2700 రూపాయలు ఖర్చయినట్లు తెలిపాడు ప్రొఫెసర్. త్వరలో ఈ సరికొత్త ఆవిష్కరణను  మరికొన్ని ఆలయాల్లో  కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాడు ప్రొఫెసర్ శ్రీకాంత్. ఇక శ్రీకాంత్ వినూత్న ఆలోచన పై నెటిజన్లను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు భక్తులు ఎంతో ప్రశాంతంగా దేవాలయాలకు  రాగలుగుతారు అని అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: