ఏపీ ఎన్నికల అధికారి గా పని చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసిపి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా, ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంగా ఆయనను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తొలగించి కొత్త ఎన్నికల కమిషనర్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఆయన ఈ  వ్యవహారంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు కి ఎక్కడం, కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం వంటి సంఘటనలు జరిగాయి. ఆ వ్యవహారం ముగిసింది అనుకుంటున్న సమయంలో, వైసీపీ ఆరోపణలకు బలం చేకూరుస్తూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యసభ సభ్యుడు బిజెపి నాయకుడు, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావు తో రహస్యంగా బేటీ అవ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 

IHG

సుజనా చౌదరి బిజెపిలో చేరినా, తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు అనే విషయం వైసీపీ మొదటి నుంచి చెబుతూనే వస్తోంది. వీరు ఇప్పటికిప్పుడు రహస్యంగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో దాదాపు గంటన్నర సేపు రహస్యంగా భేటీ అయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్క్ హయత్ హోటల్ లోని ఈ సమావేశం జరిగినట్లుగా ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ నెల 13న ఉదయం రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి పార్క్ హయత్ హోటల్ లోకి వచ్చినట్టుగా, ఆ తర్వాత అరగంట తరువాత మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు కూడా ఇదే హోటల్ కి రావడం, వీరిద్దరి తర్వాత చివరగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు అక్కడికి రావడం, ఈ ముగ్గురు వేర్వేరు లిఫ్ట్ ల ద్వారా అక్కడికి చేరుకున్న దృశ్యాలు సీసీ టీవీ రికార్డ్స్ లో బయటపడినట్టుగా తెలుస్తోంది.


ఇక ఈ ముగ్గురిని ఒకే వ్యక్తి రిసీవ్ చేసుకున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ముగ్గురు ఒకే గదిలోకి వెళ్లడం, సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస రావు ఒకే గదిలో దాదాపు గంటపాటు రహస్యంగా మీటింగ్ నిర్వహించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. మొదట కామినేని బయటకి వెళ్లగా, ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ బయటకు వచ్చారు. హోటల్ నుంచి సుజనాచౌదరి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపించాయి. 


 ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ ముగ్గురు భేటీ అవ్వడం రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తోంది. సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస రావు, బిజెపి లో ఉన్నా, వారు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డారు. ఇప్పుడు వారు ఎన్నికల కమిషనర్ తో రహస్యంగా భేటీ అయిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: