పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు.  ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. ఈ ఏడాది మాత్రం కరోనా ఎఫెక్ట్ వల్ల భక్తులు లేకుండా రథ యాత్ర కొనసాగుతుంది. 

 

రథయాత్రం అసలు కథ : 

ఆషాఢమాసంలో రెండో రోజు మొదలయ్యే ఈ వేడుక 10 – 12 రోజుల పాటు జరుగుతుంది. ఈ యాత్రకు సంబంధించి సహజంగా మూడు ఇతిహాసాలు ఉన్నాయి. మొదటిది జగన్నాథుడు (కృష్ణుడు) తన మామ కంసుడిని చంపేందుకు బృందావనం నుంచి మధుర వరకు చేసే ప్రయాణం అని అంటారు. రెండోది తన తోబుట్టువులు సుభద్ర, బలరాములు జ్వరం నుంచి కోలుకుని అత్త గుండిచాను చూసేందుకు వెళ్లడం అని చెప్తారు. కృష్ణుడు తన భక్తులను కలిసేందుకు తోబుట్టువులైన సుభద్ర, బలరాములతో కలిసి బయటికి వస్తారు అని కూడా నమ్ముతారు. 

రథ యాత్రలే ప్రత్యేకంగా ఏం చేస్తారు :

పూరీలోని జగన్నాథ ఆలయంలో నిత్యం పూజలు అందుకునే జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలను ఏడాదికి ఒకసారి ఆలయం నుంచి బయటికి తీసుకస్తారు.  . అక్కడ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి అత్తగారి ఇల్లుగా చెప్పే గుడించా ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ దాదాపు 9 రోజులు ఉంచి.. ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలున్నాయి. బలరాముడిని తీసుకొచ్చే రథాన్ని తలాద్‌వాజా అంటారు.

IHG

దానికి 16 చక్రాలు ఉండగా.. 45 అడుగుల ఎత్తు ఉంటుంది. సుభద్ర వెళ్లే రథాన్ని దేవదలానా అంటారు. దీనికి 14 చక్రాలు ఉండగా.. 44.6 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండు భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి. సింహ ద్వారానికి ఇరు వైపులా ఇది తూర్పు వైపుకు తెరుచుకుని ఉంటుంది. జగన్నాథుడిని ఉంచే రథాన్ని నందిఘోషా అంటారు. 18 చక్రాలు, 45.6 అడుగుల ఎత్తు ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: