మన భారత ఆచార సంప్రదాయాలలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మన ఆచార కట్టుబాట్లు వెనుక ఏదొక బలమైన కారణం ఉంటుంది. అది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అలా తెలుసుకోవాలి అనుకోవాలి అనుకునే వారికి ఈ ఆర్టికల్ ఒక కొత్త విషయాన్ని చెప్తుంది. మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరపడానికి చాలా తతంగమే ఉంటుంది. ఎన్నో కట్టు బాట్లు ఆచారాలను పాటిస్తూ అంత్యక్రియలు చేస్తారు మన పెద్దవాళ్లుం అయితే మనిషి చనిపోయిన తర్వాత కాలి బొటన వేళ్ళకి కలిపి తాడు కడతారు. అలా ఎందుకు కడతారో తెలుసా...?

 

 

మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియల సమయం లో చేసే ఒక పని శవాని కి కాలి రెండు బొటన వేళ్ళు కలిపి దారం తో కట్టడం.మనిషి చని పోయిన తర్వాత శరీరం నుండి ఆత్మ వేరే పోతుంది అన్న విషయం అందరికి తెలిసిందే, కానీ చని పోయిన తర్వాత కూడా తన ఆత్మ ఇంకా బత కాలి అని తన వాళ్ల తో ఇంక ఉండాలి అని ఎంతో ఆరాట పడుతూ ఉంటుంది అని మీకు తెలుసా. చనిపోయిన చాలా గంటలు ఆత్మ శరీరం చుట్టునే తిరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ మల్ళి తిరిగి శరీరం లో కి ప్రవేశించి అలా తిరిగి తన జీవితం లో కి వెళ్లి పోవాలి అనుకుంటూ ఉంటుంది. దాంతో శవం లో కి దూరి లేచి మళ్ళీ తన ఇంట్లో కి వెళ్లి పోవడాని కి ప్రయత్నిస్తూ ఉంటుంది, అయితె ఆ ఆత్మ అలా ప్రయత్నిస్తు ఉన్నప్పుడు కాళ్లను కదలకుండా ఉంచటం కోసం ఒక తాడు లేదా ఓ దారం తో ఆ చని పోయిన వారి రెండు బొటన వేళ్ల ను కదలకుండ కట్టేస్తారు.

 


శాస్త్రం ప్రకారం ఇలా ఉంటే  దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. ఈ లాజిక్ ప్రకారం చని పోయిన తర్వాత శరీరం బిగుసుకు పోతుంది, దాంతో ఆ చని పోయిన వ్యక్తి కి చలనం ఉండదు కాబట్టి చని పోయిన వారి కాళ్లు పక్కకి పడిపోతుంటాయి, కాబట్టి ఆ కాళ్ళు అలా అవకుండా, పడకుండ ఉండడాని కి రెండు కాళ్లను ఇలా కలిపి కట్టేస్తారు అని లాజికల్ గా కొందరు చెప్తారు. ఆచారం ప్రకారం అయినా లాజిక్ ప్రకారం అయిన ఇలా కాళ్లు రెండూ కలిపి కట్టడాని కి వెనుక ఉన్న కారణం మాత్రం బల మైనదే అని చెప్పాలి. ఇలా మనిషి చనిపోయిన తర్వాత కాలి బొటన వేళ్లు కట్టడానికి కారణం ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: