దేశంలో ఈ మాయదారి కరోనా ఏమంటూ ప్రవేశించిందో కానీ ప్రతి ఒక్కరి జీవిన శైలి పూర్తిగా మార్చి వేస్తుంది. ఒకప్పుడు ఎంతో మంచిగా బతికినవారు ఇప్పుడు రోడ్డు పైకి రావాల్సి వస్తుంది.  పెద్ద పెద్ద హూటల్ యజమానులు సైతం మార్కెట్ లో కూరగాయలు, పండ్లూ అమ్మే దుస్థితి ఏర్పడింది.  పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మడం అంటే ఇదేనేమో.  ఉపాధి దొరక్క.. ఉద్యోగాలు లేక.. ఉద్యోగాలు ఉన్నా జీతాలు ఇవ్వక ఎంతోమంది రోడ్డున పడ్డారు.  తాజాగా పాఠాలు చెప్పిన ఓ టీచర్ తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. వేదాయపాళెంకు చెందిన వెంకటసుబ్బయ్య 2008 నుంచి ప్రైవేటు కార్పొరేట్‌ స్కూలులో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

IHG

ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఎంఏ తెలుగు, బీఈడీ పూర్తిచేశారు. కొత్త అడ్మిషన్లు చేర్చడానికి టార్గెట్‌ పూర్తి కాకపోవడం, స్మార్ట్‌ ఫోన్‌ కూడా మొరాయించడంతో విద్యా సంస్థ యాజమాన్యం ఆయన్ను పక్కనపెట్టింది. దాంతో ఆయన రోడ్డుపై అరటి పండ్లు అమ్మారు. కంబదూరు మండలం నూతిమడుగులో మురళీమోహన్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఫుల్ టైమ్ గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్నారు.  మూడు నెలలుగా జీతాలు లేకపోవడం, పాఠశాలల ప్రారంభానికి ఇంచా చాల సమయం ఉండటంతో కుటుంబ పోషణ చాలా ఇబ్బంది అయ్యింది. దాంతో సంతలో కూరగాయలు అమ్మడం మొదలు పెట్టారు. సత్తుపల్లికి చెందిన రాంబాబు స్కూల్ ప్రిన్సిపల్‌గా పని చేశారు.

IHG

ఇటీవల అతని ఉద్యోగం పోవడంతో సంక్షోభంలో పడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఉపాధి మార్గాలు లేక సొంతంగా ఓ బజ్జీల బండిని అద్దెకు తీసుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భార్యతో  కలిసి పునుగులు, బజ్జీలు వేస్తూ ఉండటం చూసిన వారంతా అతని పరిస్థితి చూసి చలించిపోతున్నారు.  ఎంఏ, బీఈడీ చదివి దాదాపు 17 ఏళ్లపాటు టీచర్‌గా పని చేశారు.  విద్యార్థులకు ఎన్నో విషయాలను అర్థమయ్యేలా షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశారు. అలాంటి వ్యక్తిని కరోనా కష్టాలపాలు చేసింది.  ప్రైవేటు టీచర్ల బతుకుచిత్రానికి నిదర్శనంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: