ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు ఇప్పుడు వేగంగా మారుతున్నాయి. రాజకీయంగా రాష్ట్రంలో ఏపీ సర్కార్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు గాని... త్వ‌ర‌లో జరిగే పరిణామాలు కొన్ని ఆసక్తికరంగా మార‌తాయ‌న్న టాక్ వైసీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా ఇప్పుడు  కాస్త ఆస‌క్తిగా మారాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఊపందుకుంది. త్వ‌ర‌లోనే సిఎం జగన్  కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచార౦. 

 

పార్టీకి ఎప్ప‌టిక‌ప్పుడు త‌ల‌నొప్పిగా మారుతోన్న న‌ర‌సాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు వ్యవహారంలో సిఎం సీరియస్ గానే ఉన్నారు. ఆయన ఇప్పుడు రఘు విషయంలో కట్టడి చేయకపోతే మాత్రం మరి కొందరు నేతలు ఇలాగే మాట్లాడే అవకాశం ఉందని  భావిస్తున్నారు. ముందుగా ర‌ఘుతో ప్రారంభ‌మైన అసంతృప్తి ఒక్క‌సారిగా పెరిగిపోయింది. రోజాతో సహా ప‌ది మంది ఎమ్మెల్యేలు ఓపెన్‌గానే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దీంతో జ‌గ‌న్ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు రెడీ అవుతున్నార‌ట‌.

 

ఎంపీ ర‌ఘును పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనకు పరోక్షంగా సహకరించే నేతల మీద కూడా ఒక కన్నేశారట‌. ఆయనతో పాటుగా మరి కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కొందరు కంట్రోల్ అవుతారని, అదే విధంగా ఇద్దరు ఎమ్మెల్యేల మీద కూడా నెల్లూరు జిల్లాలో చర్యలు తీసుకోవడం మంచిది అనే భావన లో సిఎం ఉన్నారు అని అంటున్నారు. త్వరలోనే వారి మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మరి వారు ఎవరు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: