కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పటికే 47 లక్షలమంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇంకా ఇంకా వ్యాప్తి ఎక్కువే ఉంది తప్ప తగ్గటం లేదు. అలాంటి కరోనా వైరస్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్ పెట్టినప్పటికీ.. అప్పటికి అదుపులో ఉన్నట్టు అనిపించినా రోజు రోజుకు కరోనా వైరస్ పెరిగిపోతుంది. 

 

ఇంకా ఇప్పుడిప్పుడే ఈ కరోనా వైరస్ ఒకో చోటా వ్యాక్సిన్ సిద్ధం అవుతూ వస్తుంది. అయితే ఇది వర్షాకాలం కావడంతో కరోనా వైరస్ రోజు రోజుకు దేశంలో విస్తరిస్తూ చుక్కలు చూపెడుతుంది. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కాలం కాబట్టి దగ్గు వచ్చినా బయపడిపోతున్నాం. 

 

మాములుగా జ్వరం లేదా కరోనాలో తెలియక ఆందోళన చెందుతున్న శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్ధాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల టీల ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు. 

 

ఉల్లిపాయతో తయారు చేసిన టీ తాగడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని మన పెద్దలు చెప్తుంటారు. గుండె జబ్బులు ఉన్న వాళ్లకు ఉల్లి మేలు చేస్తుంది. ఇంకా అలానే ఉల్లితో తయారు చేసిన టీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ వర్షాకాలంలో  సీజనల్ గా వచ్చే జ్వరం, జలుబు వంటివి వాటిని ఈ టీ ఉపశమనం కల్గిస్తుంది. మరి ఈ ఉల్లిపాయ టీ ని చేసుకొని తాగండి.. కరోనా నుండి ఉపశమనం పొందండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: