ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో బిజెపి నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావు రహస్యంగా భేటీ అవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీ పూటేజీ బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఇప్పటికే బిజెపి ఈ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు సుజనా చౌదరి స్పందించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ప్రైవేట్ హోటల్స్ లో రహస్య భేటీలు చేయాల్సిన అవసరం ఏముందని మీడియా సుజనాచౌదరి ప్రశ్నించగా ఇది మర్యాదపూర్వక భేటీ అని, దీంట్లో తప్పేముంది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. 

IHG


అర్థంలేని వీడియో టేపులతో వైసీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరస్థుడు కాదని, ఆయనను కలవకూడదని రూలేమీ లేదు కదా అన్నారు. మేము ఇద్దరం మంచి మిత్రులం, ఎక్కడైనా, ఎప్పుడైనా కలుస్తాం, ఇందులో తప్పేముంది అంటూ సుజనా చౌదరి క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ వైసిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, లక్షల్లో ఫీజులు తీసుకునే లాయర్లను ఏవిధంగా పెట్టుకున్నారు అని ప్రశ్నించారు.


 రమేష్ కుమార్ లాయర్లకు డబ్బు మొత్తం చంద్రబాబు చెల్లిస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఈ వ్యవహారంలో తాము వెనక్కి తగ్గేది లేదని, ఎంత దూరమైనా వెళ్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనుక ఖచ్చితంగా టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారంటూ ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఈ విధంగా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: