నారా లోకేష్ ! టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, చంద్రబాబు రాజకీయ వారసుడిగా, తెలుగుదేశం పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో అయినా, ఆయన టిడిపి రథసారధిగా ఉంటారు అనేది నిజం. అందుకే లోకేష్ ను బలమైన నాయకుడు తయారు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. కాకపోతే లోకేష్ ప్రసంగాలు గాని, వ్యవహారశైలి కానీ, ఇప్పటి రాజకీయాలకు పనికిరావు అనేది తెలుగు తమ్ముళ్లు సైతం భావిస్తూ ఉంటారు. అయినా లోకేష్ పనితీరును మెరుగుపరిచుకుని, పార్టీ నాయకుల్లో నమ్మకం కలిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 


ఇక కరోనా  సమయంలో లోకేష్ కు ప్రత్యకంగా తెలుగు భాష కు సంబంధించి, అలాగే ప్రసంగాలు,  ప్రత్యర్ధులపై పదునైన మాటలతో ఎదురుదాడి చేయడం వంటి విషయాలపై ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారనే ప్రచారమూ జరిగింది. ఎన్ని చేసినా, లోకేష్ ఎంత సీరియస్ గా  విమర్శలు చేసినా, దానిని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కామెడీగానే చూస్తూ ఉంటారు. అయినా లోకేష్ ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. తాజాగా తన మామ నందమూరి బాలకృష్ణ నటించిన సింహా సినిమాలోని కొన్ని డైలాగులతో వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ విమర్శలు చేశారు.

 

" వైకాపా మాఫియా ఇసుక కొట్టేస్తే నో సిఐడి, ఇళ్ల స్థలాలు అమ్ముతుంటే నో సిఐడి, ఇళ్ల స్థలాలు కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సిఐడి, విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ, వేలకోట్ల జె టాక్స్ వసూలు చేస్తుంటే నో సిఐడి. 108లో కుంభ కోణం బయటపడితే నో సిఐడి, మైన్స్ మింగేస్తుంటే నో సిఐడి అంటూ బాలయ్య సినిమా డైలాగులతో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే మరో ట్వీట్లో మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడుతుంటే నో సిఐడి, రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేశారు వైయస్ జగన్ గారు. 

 

భావ ప్రకటన స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ లోకేష్ ప్రశ్నించారు. లోకేష్ ఈ తరహా విమర్శలు చేయడం మామూలే అయినా, ఇప్పుడు తన మామయ్య బాలకృష్ణ సినిమా డైలాగులు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసేందుకు ఉపయోగించుకోవడం చూస్తుంటే, బాలయ్య స్టైల్ లో ఫైర్ ఉన్న నాయకుడు అని లోకేష్ తనను తాను ప్రమోట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: