మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ విప‌రీతంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డిలో ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా ఉన్న పోలీసుల్లోనూ ప్ర‌తి రోజూ పాజిటివ్ కేసులు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 4,048 మంది పోలీసులు క‌రోనా బారిన‌ప‌డ్డార‌ని తెలిపింది. చికిత్స త‌ర్వాత 3 వేల మంది డిశ్చార్జ్ కాగా.. 47 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్ర‌స్తుతం 1001 మంది పోలీసులు వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని వెల్ల‌డించింది.  మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి.

 

అయితే రాష్ట్ర ప్ర‌భుత్వ చేత‌గాని త‌నంవ‌ల్లే కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్న‌ద‌ని ప్ర‌తిప‌క్ష బీజేపీ ఆరోపిస్తున్న‌ది. కాగా, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు కాగా.. అందులో ల‌క్షా 28 వేల పాజిటివ్ కేసులు ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే వ‌చ్చాయి. కేసులు వేగంగా పెరుగుతున్నా అందుకు త‌గ్గ‌ట్టుగా ప‌రీక్ష‌ల సంఖ్య పెరుగ‌డం లేద‌ని బీజేపీ నేత‌, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ విమ‌ర్శించారు.

 

ఇక రాష్ట్రంలో అందుబాటులో ల్యాబ్‌ల‌లో రోజుకు 38,000 ప‌రీక్ష‌లు చేసే సామ‌ర్థ్యం ఉన్న‌ద‌ని, శివ‌సేన నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారు మాత్రం రోజుకు కేవ‌లం 14,000 మందికే ప‌రీక్ష‌లు చేయిస్తున్న‌ద‌ని ఫ‌డ్నవీస్ ఆరోపించారు.  అంతే కాదు కేసులు పెరుగుతున్న వేళ టెస్టుల సంఖ్య త‌గ్గించ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌న్నారు.  ఇలాంటి ప‌రిస్థితుల్లో టెస్టుల‌ సంఖ్య పెంచ‌డ‌మే స‌రైన ప‌రిష్కార‌మ‌ని ఫ‌డ్న‌వీస్ సూచించారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: